మహాకాల్ ఆలయంలో ప్రియాంక పూజలు

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ లోని మహాకాలేశ్వర్ ఆలయంలో సోమవారం(మే-13,2019) కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పూజలు నిర్వహించారు.ప్రియాంక వెంట సీఎం కమల్ నీథ్ కూడా ఉన్నారు. 

ప్రియాంక మహాకాలేశ్వర్ ఆలయంలో పూజలు నిర్వహించడంపై స్పందించిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్…పూజా చేసే సమయంలో సీఎం కమల్ నాథ్,మీ అన్న రాహుల్ గాంధీని విషయం అడగండి ప్రియాంక గారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే 10 రోజుల్లోనే రైతు రుణాలు మాఫీ చేస్తామని వాళ్లు ప్రామిస్ చేశారు.అలా చేయకుంటే సీఎం తొలగించబడతాడు అని కూడా అన్నారు.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చినట్లుగా రైతుల రుణాలు మాఫీ చేయలేదు.సీఎం మీ అన్నను తప్పుదోవ పట్టిస్తున్నాడు.మీ అన్నరాహుల్ అబద్దాలు చెబుతున్నాడు అని కమల్ నాథ్ విమర్శించారు.