Mumbai
Mumbai : గ్రాడ్యుయేషన్ డే.. జీవితంలో మర్చిపోలేని రోజు. ప్రత్యేకమైన రోజు. స్టూడెంట్స్ ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఇక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకునే క్షణాలు మరింత అపురూపం. ఆ టైంలో వేదికపై డ్యాన్స్‌లు చేయడం సర్వసాధారణం అయిపోయింది. అలాగే ముంబయిలో ఓ స్టూడెంట్ డ్యాన్స్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే?
Mumbai college : ముంబయి కళాశాలలో బురఖా, హిజాబ్‌పై ఆంక్షలు
నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకగా జరుగుతోంది. విద్యార్ధులు తమ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అందుకుంటున్నారు. ఆర్య కొఠారి అనే స్టూడెంట్ బాలీవుడ్ పాట ‘తెను లేకే’ కి స్టెప్పులు వేస్తూ సర్టిఫికేట్ అందుకోవడానికి వేదికపైకి వెళ్లాడు. ఇది చూసిన ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. మరోవైపు స్టేజ్ మీద ఉన్న ప్రొఫెసర్లకు అతను అలా రావడం నచ్చలేదు. అంతే.. డిగ్రీ ఇవ్వడానికి నిరాకరించారు. వెంటనే ఆర్య సారీ చెప్పడంతో అతనికి డిప్లొమాను అందించారు. ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించవద్దని హెచ్చరించారు. ఆర్య కొఠారి ఈ సందర్భంలో తీసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (arya_kothari) షేర్ చేసాడు. ‘జీవితాంతం డ్యాన్స్ చేస్తాను’ అనే ట్యాగ్ లైన్‌తో అతను చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Mumbai : ముంబయిలో భారీగా క్యూ కట్టిన ప్రజలు .. దేని కోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు
‘ఆర్య చేసిన పనిలో తప్పు లేదని.. ఉపాధ్యాయులు మరీ అంత ఎక్కువగా స్పందించకూడదని’ అని.. ‘స్టూడెంట్స్‌ను తమ కాన్వకేషన్‌లో వారికి నచ్చిన విధంగా ఆనందించనివ్వండి.. డ్యాన్స్ చేయడం వల్ల ఎవరికీ నష్టం జరగదు’ అని అభిప్రాయపడ్డారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. రియాక్షన్లు వెల్లువెత్తుతున్నాయి.