Rakesh Tikayat : రైతు సంఘం నేత రాకేష్‌ టికాయత్‌పై దాడి

ఊహించని ఘటనతో ముందు దిగ్ర్భాంతి గురైన టికాయత్ అనుచరులు...నిరసనకారులపై ఎదురుదాడికి దిగి వారితో తలపడటంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. కార్యక్రమం కాస్త రసాభాసగా మారింది.

Tikayat

attack on Rakesh Tikayat : బెంగళూరులో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. రైతు సంఘం నేత రాకేష్‌ టికాయత్‌పై దాడి జరిగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రైతు సంఘం నేత,  భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేష్‌ టికాయత్‌పై దాడి చేశారు. మీడియా ముందు మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా కొంతమంది నిరసనకారులు ఆయన ముఖంపై నల్ల సిరా చల్లారు. ఆయన పక్కనే ఉన్న యుధ్వీర్‌ సింగ్‌ ముఖంపై కూడా సిరా చల్లారు. అంతటితోనే ఆగ్రహం చల్లారని నిరసనకారులు…స్టేజిపైకి కుర్చీలు విసిరారు.

ఊహించని ఘటనతో ముందు దిగ్ర్భాంతి గురైన టికాయత్ అనుచరులు…నిరసనకారులపై ఎదురుదాడికి దిగి వారితో తలపడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యక్రమం కాస్త రసాభాసగా మారింది. కొడిహల్లి చంద్రశేఖర్‌ అనే కర్ణాటక రైతు నేత డబ్బు తీసుకుంటూ…ఓ ఛానెల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికిపోయిన ఘటనకు సంబంధించి… రాకేష్‌ టికాయత్‌, యుధ్వీర్‌ సింగ్‌లు వివరణ ఇస్తున్న సమయంలో వారిద్దరిపైనా దాడి జరిగింది.

Rakesh Tikait : మోడీని కిమ్ తో పోల్చిన తికాయిత్

జరిగిన ఘటనపై రాకేష్‌ టికాయత్‌ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కార్యక్రమానికి పోలీసులు రక్షణ కల్పించలేదని, ప్రభుత్వం కనుసన్నల్లోనే తనపై దాడి జరిగిందని ఆరోపించారు. మరోవైపు దాడికి కారణంగా భావిస్తున్న రైతు నేత చంద్రశేఖర్‌ అనుచరులను కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.