ఇండియా గేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు

ఢిల్లీలోని సఫ్థార్ గంజ్ హాస్పిటల్ లో శుక్రవారం అర్థరాత్రి  ట్రీట్మెంట్ పొందుతూ మరణించిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ప్రజలు స్వచ్ఛందంగా రాజ్ ఘాట్ నుంచి ఇండియా గేట్ వరకు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

నిరసనకారులు ఇండియా గేట్ వైపు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారిపై వాటర్ కానన్స్ ను ప్రయోగించారు. జాతీయ జెండాలు చేతిలో పెట్టుకుని పోలీసుల బారికేడ్లు దాటుకుని వెళ్లేందుకు నిరసనకారులు యత్నించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.