పాపులర్ వీడియో గేమ్ ‘పబ్‌జీ’ బ్యాన్

ఒకసారి పబ్‌జీ గేమ్ ఆడితే చాలు.. మళ్లీ మళ్లీ ఆడాలనిపించే గేమ్. వదిలిపెట్టరంతే.. ఎంతటివారైన సరే పబ్ జీ గేమ్ కు అడిక్ట్ అవ్వాల్సిందే. మొబైల్ వెర్షన్ రావడంతో ఇక ఈ గేమ్ కు పట్టాపగ్గాలు లేకుండా పోయింది.

  • Publish Date - January 25, 2019 / 07:07 AM IST

ఒకసారి పబ్‌జీ గేమ్ ఆడితే చాలు.. మళ్లీ మళ్లీ ఆడాలనిపించే గేమ్. వదిలిపెట్టరంతే.. ఎంతటివారైన సరే పబ్ జీ గేమ్ కు అడిక్ట్ అవ్వాల్సిందే. మొబైల్ వెర్షన్ రావడంతో ఇక ఈ గేమ్ కు పట్టాపగ్గాలు లేకుండా పోయింది.

పబ్‌జీ.. పబ్‌జీ.. పబ్‌జీ.. వీడియో గేమ్ లవర్స్ కు పెద్దగా పరిచయం అక్కర్లేని గేమ్. 2018లో రిలీజ్ అయిన ఈ వీడియో గేమ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఆన్ లైన్ గేమ్ కు యువత ఫిదా అయిపోయింది. ఏ ఫోన్ లో చూసినా పబ్ జీ గేమ్ ఉండాల్సిందే. ఈ గేమ్‌కు ఎంతగా కుర్రాళ్లు అడిక్ట్ అయిపోయారంటే.. గంటలుగంటలు ఇందులోనే గడిపేస్తున్నారు. పాపులర్ ఆన్ లైన్ మల్టీప్లేయర్ పబ్‌జీ వీడియో గేమ్ ను.. మిలిటరీ స్టైల్ షూటర్ బ్యాటిల్ రాయల్ గేమ్ గా పిలుస్తారు. పబ్‌జీ గేమ్ పీసీ, ఎక్స్‌బాక్స్ వన్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లల్లో అందుబాటులో ఉంది. పబ్‌జీ మొబైల్‌కు ఇండియాలో బాగా క్రేజ్ పెరిగిపోవడంతో ప్రైమరీ స్కూళ్లు, కాలేజీ క్యాంపస్ లో కూడా ల్యాబ్ ల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ గేమ్ కు అడిక్ట్ అయిన విద్యార్థులు చదువును గాలికి వదిలేసి పబ్‌జీ జపం చేస్తున్నారు. దీంతో పరీక్ష ఫలితాల్లో మార్కులు తగ్గిపోయాయి. విద్యార్థుల చదువులు పాడవుతున్నాయంటూ తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైమరీ స్కూళ్లు, క్యాంపస్ ల్లో ఈ గేమ్‌పై వెంటనే నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. 

పబ్ జీ గేమ్ కు.. గుజరాత్ బ్రేక్
పబ్‌జీ గేమ్ కు బానిసైన విద్యార్థులను గాడిలో పెట్టేదిశగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థుల చదువుల దృష్ట్యా పబ్‌జీ వీడియో గేమ్ ను అధికారికంగా నిషేధం విధించింది. గుజరాత్ ప్రైమరీ ఎడ్యుకేషనల్ డిపార్ట్ మెంట్ (జీపీఈడి) పలు ప్రైమరీ స్కూళ్లకు పబ్‌జీ గేమ్ పై నిషేధం విధించాల్సిందిగా ఓ సర్క్యూలర్ జారీ చేసింది. యువతపై భారీ ప్రభావం చూపిస్తోన్న పబ్‌జీ వీడియో గేమ్ ను అన్నీ స్కూళ్లలో వెంటనే బ్యాన్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఇటీవల గుజరాత్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సూచనల మేరకు జీపీఈడి ఈ దశగా నిర్ణయం తీసుకుంది. ‘‘పబ్‌జీ గేమ్ కారణంగా స్కూళ్లో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో వచ్చే బోర్డు ఎగ్జామ్స్ దృష్ట్యా అన్ని స్కూళ్లలో పబ్ జీ గేమ్ ను నిషేధిస్తున్నట్టు సర్క్యూలర్ లో తెలిపింది. గత ఏడాదిలో వేలూరు కాలేజీ క్యాంపస్ లో పబ్‌జీ గేమ్ పై నిషేధం విధించారు. పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ గేమ్ పై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని ఎన్ సీ పీసీఆర్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేస్తూ లేఖను పంపినట్టు చైల్డ్ రైట్స్ డిపార్ట్ మెంట్ చైర్ పర్సన్ జాగృతి పాండ్య తెలిపారు. 

ఈ గేమ్ కు ఎందుకింత క్రేజ్ అంటే..
పబ్‌జీ… ఇది మిలిటరీ స్టైల్ షూటర్ బ్యాటిల్ రాయల్ గేమ్. ఈ గేమ్ లో 100 మంది ప్లేయర్స్‌ బ్యాటిల్ గ్రౌండ్ లోకి దిగుతారు. ఒకరిపై మరొకరు యుద్ధం చేస్తుంటారు. చివరి వరకు ఈ గేమ్ లో ఎవరు ఉంటారో వాళ్లే విన్నర్. ఒకసారి ఈ గేమ్ ఆడితే చాలు.. మళ్లీ మళ్లీ ఆడాలనిపించే గేమ్. వదిలిపెట్టరంతే.. ఎంతటివారైన సరే పబ్ జీ గేమ్ కు అడిక్ట్ అవ్వాల్సిందే. మొబైల్ వెర్షన్ రావడంతో ఇక ఈ గేమ్ కు పట్టాపగ్గాలు లేకుండా పోయింది. అందులోనూ స్మార్ట్ ఫోన్లలో 4జీ నెట్ వర్క్ అతి తక్కువ ధరకే అందుబాటులోకి రావడంతో యువత ఈ పబ్ జీ గేమ్ కు ఇంకా అడిక్ట్ అయిపోయారు.

వీడియో గేమ్స్ రారాజు పబ్‌జీ
పబ్‌జీ… ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్ తొలిసారి ఈ గేమ్‌ను మైక్రోసాఫ్ట్ విండోస్‌లో 2017 మార్చిలో రిలీజ్ చేశారు. ఇక మొబైల్ వర్షన్ భారత్ లో 2018లో మార్చిలో రిలీజ్ అయింది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో 10 కోట్లకు పైగా డౌన్‌లోడ్స్ గేమ్ గా పబ్ జీ రికార్డులు బ్రేక్ చేసి వీడియో గేమ్స్ మొబైల్ యాప్ గేమ్ రారాజుగా నిలిచింది. గూగుల్ ప్లే స్టోర్‌లో 4 నెలల్లో 10 కోట్ల డౌన్‌లోడ్స్‌తో ఇటీవల రికార్డు నమోదు చేసింది. గతంలో ఈ గేమ్ నిషేధంపై ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వార్తలు పుకార్లేనని అప్పట్లో పబ్ జీ వర్గాలు కూడా స్పష్టం చేశాయి.