ఇండియాలో పబ్‌జీ బ్యాన్: షరతులు వర్తిస్తాయి

  • Publish Date - March 23, 2019 / 02:33 AM IST

పబ్‌జీ గేమ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎటువంటి అలజడి క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందరో యువకులు ఈ గేమ్‌కు అడిక్ట్ అయిపోయి జీవితాలను నాశనం చేసుకుంటుండగా.. మరికొందరు ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ గేమ్‌ను బ్యాన్‌ చేయాలని స్వచ్ఛంద సంస్థల దగ్గరి నుంచి రాజకీయ పార్టీల వరకు ప్రతీ ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు.
Read Also : నారా లోకేష్‌కు గట్టి షాక్: మంగళగిరిలో మారిన రాజకీయం

ఈ నేపధ్యంలో భారత్‌లో పబ్‌జీని ఆరు గంటలు మాత్రమే ఆడేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పబ్‌జీ గేమ్‌ను కేవలం ఆరు గంటలు మాత్రమే ఆడవలసి ఉంటుంది. అంతకుమించి ఆడుకోవాలంటే కుదరదు. పబ్‌జీ 6 గంటలు ఆడగానే హెల్త్‌ రిమైండర్‌ వచ్చి తర్వాత రోజు వరకు ఆటను ఆడే అవకాశం ఇవ్వదు. 18 ఏళ్ల లోపు వయస్సుగల వారికి 2 నుంచి 4 గంటల లోపే ఈ హెల్త్ రిమైండర్ నోటిఫికేషన్ వస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఎవరూ చేయలేదు.
Read Also : నేటి నుంచి ఐపీఎల్‌ సమరం : వన్డే వరల్డ్‌ కప్‌కు ముందే తొలిసారిగా