గేమర్లకు గుడ్ న్యూస్, PUBG వచ్చేస్తోంది!

  • Publish Date - November 13, 2020 / 06:15 AM IST

PUBG will return to India with a new game : PUBGగేమ్ ఎప్పుడొస్తుందా ? అని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వనుంది. గత కొన్ని రోజుల క్రితం PUBG ఇండియా నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఇండియన్ మొబైల్ గేమర్ లకు శుభవార్త అందించింది. PUBG కార్పొరేషన్ భారతదేశంలో త్వరలోనే అధికారికంగా ప్రారంభించేందుకు రంగం సిద్ధమౌతోంది.



ఇండియన్ గేమర్స్ కోసం కొత్త వెర్షన్ రూపొందించినట్లు సమాచారం. PUBG మొబైల్ ఇండియా గేమ్‌ను భారతదేశంలోకి తీసుకరావడం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని ప్లేయర్స్ వార్ గ్రౌండ్ గేమ్ సృష్టికర్త అయిన పబ్ జి కార్పొరేషన్ వెల్లడించింది.



PUBG కార్పొరేషన్ దక్షిణ కొరియా సంస్థ అయిన క్రాప్టన్ ఇంక్ అనుబంధ సంస్థ. ఈ గేమ్ వినియోగదారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన గేమ్స్ ఆడటానికి అవకాశం ఉంటుందని వెల్లడిస్తోంది. భారతదేశంలో అనుబంధ సంస్థను నిర్మిస్తామని, ఇందుకు కొంతమంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.



అయితే..భారతదేశంలో ఈ గేమ్ ఎప్పుడు ప్రారంభమౌతుందో మాత్రం స్పష్టంగా చెప్పలేదు. క్రాప్టన్ ఇంక్ భారతదేశంలో 100 మిలియన్ల పెట్టుబడిని కూడా ప్రకటించింది. భారతదేశంలో అత్యధికంగా డౌన్ లోడ్ చేయబడిన ఆటల్లో PUBG గేమ్ ఒకటి. 50 మిలియన్లకు పైగా యూజర్స్ ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు