Pulse Polio : నేడు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో.. ఐదేళ్లలోపు పిల్లలందరికీ

నేటి నుంచి మూడు రోజుల పాటు పల్స్‌ పోలియో కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాయి.

Pulse Polio

Pulse Polio program : నేడు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూఖ్ మాండ‌వీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు పోలియో చుక్కల‌ను వేశారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాల‌ని త‌ల్లిదండ్రుల‌కు మాండ‌వీయ విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి మూడు రోజుల పాటు పల్స్‌ పోలియో కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాయి.

తెలంగాణ వ్యాప్తంగా 38 లక్షల 31 వేల 907 మంది ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలు ఉండగా, 23 వేల 331 పల్స్‌ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 869 ట్రాన్సిట్‌ కేంద్రాలు అందుబాటులో ఉంచుతున్నారు. అన్ని జిల్లాలకు కలిపి మొత్తం 50.14 లక్షల పల్స్‌ పోలియో డోసులు పంపారు. సంచార జాతులు, బిక్షాటన చేసేవారు, ఇటుకబట్టీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మురికివాడలు, ఆదివాసీ పిల్లలపై సిబ్బంది ఈ సారి ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

పోలియో చుక్కలు వేయటానికి అడవిలో 10 కి.మీ నడిచి వెళ్లిన ఆరోగ్య కార్యకర్త జ్ఞానేశ్వరి

2 వేల 337 మంది సూపర్‌వైజర్లు, 869 సంచార బృందాలను ఏర్పాటు చేశారు. ఇక 8 వేల 589 మంది A.N.Mలు, 27 వేల 40 మంది ఆశాకార్యకర్తలు, 35 వేల 353 మంది అంగన్వాడీలు పల్స్‌ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పోలియో చుక్కలు వేసుకోని చిన్నారులను ప్రత్యేక బృందాల సాయంతో గుర్తించి.. ఇంటింటికి తిరిగి ఆయా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు.