పుల్వామా దాడి ఎఫెక్ట్ : పాక్ పర్యటన రద్దు చేసుకున్న చౌతాలా

  • Publish Date - February 16, 2019 / 01:07 PM IST

చండీఘడ్: పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి ఘటన కారణంగా తన 3 రోజుల పాక్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఇండియన్ నేషనల్  లోక్ దళ్ (INLD) నేత అభయ్ సింగ్ చౌతాలా. ఆయన  పాకిస్తాన్ లోని లాహోర్ లో తమ ఫ్యామిలీ  ఫ్రెండ్ ఇంట్లో వివాహానాకి హాజరవ్వాల్సి ఉంది. 

అక్రమాస్తుల కేసులో నిందితుడైన చౌతాలా ఈనెల 16 నుంచి 18 వరకు వివాహానికి లాహోర్ వెళ్లేందుకు అనుమతివ్వాలని  కోరూతూ ఈనెల 14 ఢిల్లీ హై కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.  పిటీషన్ విచారించిన  ప్రత్యేక న్యాయమూర్తి భరద్వాజ్  రూ.2 లక్షల పూచికత్తుతో పాటు కొన్ని షరతులు విధించి అనుమతిచ్చారు. కాగా…. పుల్వామా ఘటన కారణంగా తన క్లయింట్ పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్నారని చౌతాలా లాయర్ అమిత్ సాహ్ని తెలిపారు. 

Read Also :  సాలే, ఇక్కడెందుకున్నావ్ రా? పాకిస్థాన్‌కి పో..

Read Also :  సెహ్వాగ్ సేవాగుణం: వీరజవాన్ల పిల్లలను చదివిస్తా

ట్రెండింగ్ వార్తలు