కూతుర్ని లైంగిక వేధిస్తున్నాడంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన భార్య

పింపిరి-చించివాడ్ పోలీసులు రీసెంట్ గా 34ఏళ్ల వ్యక్తిని కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులు అరెస్టు చేశారు. భార్యే స్వయంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో అతనిపై కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి, గురువారం మైనర్ అయిన కూతురిపట్ల వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. రాత్రి 9గంటల 30నిమిషాల సమయంలో ఓ ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు.

గృహిణి అయిన బాధితురాలి తల్లి కంప్లైంట్ ఇచ్చింది. తన కారును పలు కంపెనీలకు లీజ్ కు ఇచ్చి ఆ సంపాదనతో బతుకుతున్నాడు. పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పీఏ కదమ్ నిందితుడ్ని శనివారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచనున్నారు.

దిఘి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఫైల్ చేసింది. సెక్షన్లు 376, 376(2)(f) ప్రకారం కేస్ నమోదు చేశారు. సెక్షన్లు 3, 4, 7, 8 బాలల రక్షణ చట్టం, పొక్సో చట్టం కింద అతనిపై ఫిర్యాదులు నమోదయ్యాయి.