Pune : జరిమానా కట్టలేదని.. వాహనదారుణ్ణీ క్రేన్‌తో ఎత్తిన ట్రాఫిక్ సిబ్బంది

నో పార్కింగ్ లో బైక్ పార్క్ చేశాడని ఓ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు జరినామా విధించారు. అది కట్టలేదని బైక్ ని దాని యజమానిని క్రేన్ సాయంతో ఎత్తారు.

Pune

Pune : నో పార్కింగ్ స్థలంలో బైక్ పార్క్ చేశాడని బైక్, దాని యజమానిని క్రేన్ తో పైకి ఎత్తి వాహనం ఎక్కించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఘటన వివరాల్లోకి వెళితే..

పుణెలోని నానాపెఠ్ ప్రాంతంలో ఉమేష్ వాడేకర్ అనే యువకుడు బైక్ పార్క్ చేశాడు. అంతలోనే అక్కడికి వచ్చిన ట్రాఫిక్ పోలీసులు ఆ బైక్ ను తన వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేశారు. బైక్ వద్దకు వచ్చిన వాడేకర్ తాను ఇప్పుడే పార్క్ చేశానని బైక్ ను వదిలేయాలని కోరాడు. అయినా పోలీసులు వినకపోవడంతో బండిపై ఎక్కి కూర్చున్నాడు.

అయినా వెనక్కి తగ్గని ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో బండిని, అతడిని పైకి లేపి తమ వాహనం ఎక్కించారు. అక్కడ ఉన్నవారు ఈ దృశ్యాలను తన మొబైల్స్ లో బంధించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ ఘటనకు కారకుడైన కానిస్టేబుల్ రాజేంద్రను కంట్రోల్‌రూమ్‌కు అటాచ్ చేశామన్నారు.

ఈ ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. రెండు నిమిషాల క్రితమే పార్క్ చేశానని.. వెంటనే వెళ్తానని చెప్పిన వినలేదని అన్నారు. రూ. 460 జరిమానా విధించారని అంతడబ్బు తన వద్ద లేదని చెప్పినా వినిపించుకోకుండా ఇలా వాహనం ఎక్కించారని తెలిపారు. ఇక ఈ ఘటనకు బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరాడు ఉమేష్ వాడేకర్.