Puneeth Raj Kumar
Puneeth Rajkumar: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచి వారం కావొస్తుంది. తమ అభిమాన హీరో మృతికి కారణం వైద్యపరమైన నిర్లక్ష్యమేననే అపోహతో దాడి చేసేందుకు యత్నిస్తున్నారట ఫ్యాన్స్. బెంగళూరు సిటీ పోలీస్.. సదాశివనగర్ లోని డా. రమణా రావు ఇల్లు, క్లినిక్ వద్ద కేఎస్ఆర్పీ భద్రత బలగాన్ని నియమించారు.
‘ఈ ప్రాంతాల్లో పరిస్థితిని చాలా దగ్గరగా పర్యవేక్షిస్తున్నాం. ఎటువంటి విపత్కర పరిస్థితులు సంభవించకుండా పాట్రోలింగ్ సిబ్బందితో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని ఓ సీనియర్ ఆఫసర్ అన్నారు. పునీత్ కు ట్రీట్మెంట్ అందించిన డా. రమణారావు, ఇతర వైద్యాధికారులు తమకు భద్రత కల్పించాలని అడగడంతోనే ఈ ఏర్పాట్లు జరిగాయి.
సీఎం బసవరాజ్ బొమ్మై, ఫనా ప్రెసిడెంట్ డా. ప్రసన్న హెచ్ఎమ్ దీని పట్ల విచారం వ్యక్తం చేశారు. అభిమానులు, శ్రేయోభిలాషులు అలా ప్రవర్తించడం సరికాదని అంటున్నారు. హెల్త్ కేర్ ప్రైవసీని ఉల్లంఘించకూడదని సూచిస్తున్నారు.
……………………………………………….: ‘కోహ్లీ నువ్వు రోజూ బర్త్ డే జరుపుకో’
పబ్లిక్ పాయింట్ ఫిగర్స్ నుంచి వస్తున్న ప్రయత్నాలను తిప్పికొడుతున్నాం. ప్రత్యేకించి డా.రమణా రావు బాగా ప్రయత్నించారని డా. ప్రసన్న వెల్లడించారు. టీవీ, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు వైద్యపరమైన నిర్లక్ష్యం అంటూ ప్రచారం చేయడం దారుణమని.. అలా చేయడం వల్ల వైద్య నిపుణుల ప్రాణాపాయం జరిగే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.