పంజాబ్ పోలీసులపై కత్తులతో దాడి…7గురు అరెస్ట్

కరోనా వైరస్ వ్యాప్తి సమయాల్లోనూ పోలీసులు ప్రాణాలకు తెగించి శాంతి భద్రతలను కాపాడుతున్నారు. కానీ, దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల పోలీసులపై దాడులు జరుగుతున్నాయి. COVID-19 లాక్ డౌన్ కారణంగా ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో ఆదివారం ఉదయం పటియాలాలోని ఓ వెటిటేబుల్ మార్కెట్ దగ్గర లాక్‌ డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు,మరికొందరి కత్తులతో దాడి చేసిన కేసులో 7గురు అనుమానితులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బల్బెరా గ్రామంలోని గురుద్వారలో దాక్కొని ఉన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నిందితులను ఆపడానికి పోలీసులు కాల్పులు చేశారని.. ఈ ఘటనలో ఓ నిందితుడు గాయపడ్డాడని ఆయన వెల్లడించారు. పోలీసుల కాల్పుల్లో ఒక అనుమానితుడు గాయపడ్డారని, అతడిని ఆసుపత్రికి తరలించామని పంజాబ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ KBS సిద్దూ తెలిపారు. ఈ ఆపరేషన్‌ను పాటియాలా జోన్ IG, జతీందర్ సింగ్ ఔలఖ్ పర్యవేక్షించారు. 

పంజాబ్ డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం…ఆదివారం ఉదయం పటియాలా మార్కెట్ దగ్గరకు కారులో వచ్చిన నిహంగ్ వర్గానికి చెందిన కొందరు బారికేడ్లను ఢీకొట్టి ముందుకు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ప్రశ్నించారు. కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి ASI హర్జీత్‌ సింగ్‌పై తల్వార్‌తో దాడి చేశాడు. దీంతో ఆయన చేయి తెగిపడింది. ఘటనలో మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన ఏఎస్‌ఐని సర్జరీ కోసం ఛంఢీఘర్ కు తరలించినట్లు తెలిపారు. ఛంఢీఘర్ హాస్పిటల్ లో ఆయనకు డాక్టర్లు సర్జరీ చేస్తున్నట్లు తెలిపారు. ఈఘటనటలో హర్జీత్ సింగ్‌తో పాటు మండీ బోర్డు అధికారి గాయపడిన్నట్లు తెలిపారు.