Captain: సిద్ధూకి అంత సీన్ లేదు.. పంజాబ్‌కి కాబోయే సీఎం ఎవరు?

కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి ముందు కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Captain Amrinder Singh: కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి ముందు కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్ భవన్ చేరుకున్న కెప్టెన్ గవర్నర్‌కు రాజీనామా లేఖ అందించారు. అనంతరం కెప్టెన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా గురించి సమాచారం ఇచ్చానని చెప్పారు.

రాజీనామా చేసిన తర్వాత, కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా నవజ్యోత్ సింగ్ సిద్ధు పేరును తాను అంగీకరించబోనని చెప్పాడు. ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యం సిద్ధూకి లేదని కెప్టెన్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజకీయ సలహాదారు కెప్టెన్ సందీప్ సంధు మరియు ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.

CM రేసులో ఎవరు?
కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత, పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి రేసులో సునీల్ జాఖర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. జాఖర్ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2012 నుంచి 2017 వరకు పంజాబ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. 2017 లోక్‌సభ ఉపఎన్నికల్లో గురుదాస్‌పూర్ నుంచి ఎంపీగా అయ్యారు.

అబోహర్ అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లోక్ సభ మాజీ స్పీకర్ బలరామ్ జాఖర్ కుమారుడు సునీల్ జాఖర్. పంజాబ్ కాంగ్రెస్ పెద్ద నాయకులలో ఒకరు సునీల్.

ట్రెండింగ్ వార్తలు