ABP-C Voter Survey: పంజాబ్‌లో పవర్‌లోకి వచ్చేది ఎవరు..?

దేశవ్యాప్తంగా మినిపోల్స్ అని భావిస్తోన్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి.

ABP-C Voter Survey: దేశవ్యాప్తంగా మినిపోల్స్ అని భావిస్తోన్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోయే ప్రాంతాల్లో సర్వేలు జోరందుకున్నాయి. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో AAP-కాంగ్రెస్ లేదా అకాలీలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో? సర్వేలు చెబుతున్నాయి. లేటెస్ట్‌గా ABP-C Voter సర్వేలో పంజాబ్‌లో పవర్‌లోకి వచ్చేది ఎవరూ? అనే విషయాన్ని వెల్లడించింది.

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి అకాలీదళ్, బీజేపీ, ఇటీవల ఏర్పాటు చేసిన మాజీ సిఎం అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం ఎదురుచూస్తున్నాయి.

పంజాబ్‌లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు?
సి-వోటర్ సర్వే:
ఆప్ – 32% కాంగ్రెస్ – 27%
అకాలీదళ్ – 11%
హంగ్ – 6%
ఇతరులు – 3%
అప్పుడే చెప్పలేం – 21%

పంజాబ్ ప్రభుత్వం మారాలని అనుకుంటున్నారా?
మారాలని అనుకుంటున్నాం- 66శాతం
మారకూడదు – 34శాతం

రైతు సంఘం కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుంది

పంజాబ్‌లో 32 రైతు సంఘాలకు గాను 22 సంఘాలు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ సంస్థలు పంజాబ్ సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో పార్టీని కూడా ప్రకటించాయి. రైతుల పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 117 స్థానాల్లో పోటీ చేస్తుంది. బల్బీర్ సింగ్ రాజేవాల్ రైతుల ఈ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు