Punjab Election : కాంగ్రెస్ తొలి జాబితా.. సిద్ధూ, సోనూసూద్ సోదరి పోటీ చేసేది ఇక్కడి నుంచే

మాన్సా స్థానం నుంచి పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా, మోగా నియోజకవర్గం నుంచి నటుడు సోనూసూద్ సోదరి మాళవిక

Punjab Congress’ first list :  పంజాబ్ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ సై అంటోంది. ఈ రాష్ట్రంలో అధికారాన్ని పొగొట్టుకోకుండా ఉండాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా..ఆ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. 2022, జనవరి 15వ తేదీ శనివారం విడుదల చేసిన జాబితాలో చమ్ కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, అమృత్ సర్ (తూర్పు) నియోజకవర్గం బరిలో పార్టీ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను నిలిపింది. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (CEC) రెండు రౌండ్ల పాటు సమావేశం జరిపి..అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది.

Read More : Pongal in AP: వేటపాలెంలో అలరిస్తున్న పడవల పోటీలు

ఉప ముఖ్యమంత్రులు సుఖ్ జిందర్ రంధవా డేరాబాబా నానక్ స్థానానికి ఎంపిక చేయగా…అమృత్ సర్ (సెంట్రల్) నుంచి ఓం ప్రకాష్ సోనీలు పోటీలో ఉన్నారు. మాన్సా స్థానం నుంచి పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా, మోగా నియోజకవర్గం నుంచి నటుడు సోనూసూద్ సోదరి మాళవికలను బరిలోకి దింపారు. రాజ్యసభ ఎంపీ ప్రతాస్ సింగ్ బజ్వా ఖాదియాన్ నుంచి పోటీ పడుతుండగా…రాష్ట్ర మంత్రి బ్రహ్మ మోహింద్ర కుమారుడు మోహిత్ కు పాటియాల (గ్రామీణ) స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. చన్నీ, సిద్ధూలను వారి వారి స్థానాల నుంచి బరిలోకి దింపింది కాంగ్రెస్.

మొత్తం అసెంబ్లీ స్థానాలు 117
మ్యాజిక్ ఫిగర్ 59
ప్రస్తుతం కాంగ్రెస్‌కు 80 సీట్లు
ఆప్‌ -17
బీజేపీ -2

Read More : Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ బర్త్‌డే సెలబ్రేషన్స్

కాంగ్రెస్ పాలనలో ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. రైతు ఉద్యమానికి పంజాబ్ కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. కేంద్రం మెడలు వంచడానికి సహకరించిన కాంగ్రెస్ కు రైతులు ఓట్ల వర్షం కురుస్తాయన్న భావనలో ఉన్నారు ఆ పార్టీకి చెందిన నేతలు. అయితే…అమరీందర్ సింగ్ రాజీనామా, కాంగ్రెస్ మార్క్ అంతర్గత రాజకీయాలు వంటి పరిస్థితులను తట్టుకుని.. విజయం సాధించడం.. ఆ పార్టీకి సవాల్‌గా మారింది. ఓ రకంగా కాంగ్రెస్‌కు ఇది జీవన్మరణ సమస్య. పంజాబ్ ఎన్నికల్లో గెలవలేకపోతే.. కాంగ్రెస్ స్థితి మరింతగా దిగజారుతుంది.

ట్రెండింగ్ వార్తలు