Farm Debt Waiver : రూ.590 కోట్ల రుణాలు మాఫీ చేసిన పంజాబ్ సీఎం

వ్యవసాయ కూలీలు, కౌలుదారులకు రుణమాఫీ చేయనున్నట్లు బుధవారం పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు.

Farm Debt Waiver వ్యవసాయ కూలీలు, కౌలుదారులకు రుణమాఫీ చేయనున్నట్లు బుధవారం పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు. పంజాబ్ ప్రభుత్వ “రుణ మాఫీ పథకం” కింద సేద్యం మీద ఆధారపడిన కూలీలు, కౌలు రైతులకు రూ.590 కోట్ల రుణాలను రద్దు చేస్తున్నట్టు సీఎం కార్యాలయం తెలిపింది.

2,85,325 మంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) సభ్యులకి ప్రభుత్వం రుణ మాఫీ చేయనుందని సీఎం కార్యాలయం పేర్కొంది. ఒక్కొక్కరికి రూ. 20,000 చొప్పున రుణం మాఫీ అవుతుందని తెలిపింది. ఆగస్టు 20 నుంచి రుణసాయానికి సంబంధించిన చెక్​లు అందించనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. పంజాబ్ కాంగ్రెస్ 2017లో ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా ఏర్పాటు చేసిన ‘రుణ మాఫీ పథకం’ కింద ఇప్పటివరకు మొత్తంగా 5.64 లక్షల మంది రైతులకు రూ. 4624 కోట్ల రుణమాఫీ చేసినట్టు తెలిపారు. దీనికి అదనంగా ఎస్‌సీ, బీసీ కేటగిరీల కింద రుణాలను ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున మాఫీ చేసినట్టు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు