జస్టిస్, మీ మూడ్ ఎలా ఉంది? ఇంకోరోజు వాదించమంటారా?

  • Publish Date - February 21, 2020 / 11:25 AM IST

పంజాబ్, హర్యానా హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ ముందుకు ఓ రిక్వెస్ట్ వచ్చింది. ఓ కేసులో నిందుతుడి తరుపు లాయర్, ఈరోజు వద్దు మరోరోజు విచారించాలని జడ్జిని కోరారు. ఆరోజు జడ్జి సీరియస్ గా ఉన్నారు. అతని కేసులోనూ అలాగే ఉండొచ్చన్న అనుమానం లాయర్ ది. అందుకే ఇంకోరోజు మీ ముందు వాదిస్తానని, విచారణను వాయిదా వేయమని అభ్యర్ధించాడు.

జస్టిస్ రాజీవ్ నారాయణ్ రైనా ఆర్డర్ ఇచ్చారు. “కోర్టు మూడు ఈరోజు బాలేదు. మొదటి నాలుగు అర్జెంట్ కేసులను కొట్టివేశాను కాబట్టి, తన కేసును వేరేరోజు విచారించాలని అభ్యర్దించారు. అందుకే నేను వేరేరోజు వాదించడం కోసం వాయిదా వేస్తున్నాను. ఇంకో సంగతికూడా చెప్పాలనుకొంటున్నాను. ముందు వచ్చిన కేసులు విచారించడానికి పనికిరానవి.”

కోర్టుల్లో న్యాయమూర్తుల దయాదాక్షణ్యాల మీద వాయిదాలు ఆధారపడి వుంటాయని లాయర్లు అంటుంటారు. కొందరు జడ్జీల దగ్గరకు కేసు వెళ్తే వణికిపోతారు. మరికొందరు అభ్యర్ధనలను ఒప్పుకొంటారని కూడా అంటారు. అందుకే మూడ్ ను బట్టి కూడా వాయిదాలు, వాదనలు ఉంటాయని సీనియర్ న్యాయవాదులూ అంటుంటారు. ఈకేసులో లాయర్ అభ్యర్ధనను జడ్జి ఒప్పుకున్నా, అసలు విషయం చెప్పారు.