ఉగ్రదాడులకు ఫ్లాన్…ఢిఫెన్స్ బేస్ ల దగ్గర ఆరెంజ్ అలర్ట్

పాకిస్తాన్ నుండి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి పంజాబ్ చుట్టుపక్కల చొరబడ్డారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి వచ్చిన సమాచారంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. భారత భద్రతా సంస్థలపై ఉగ్రవాదులు దాడి చేయడానికి ప్రయత్నిస్తారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గతంలో సమాచారమందించ విసయం తెలిసిందే.

పాకిస్తాన్ నుండి ఉగ్రవాదుల బృందం భారతదేశంలోకి చొరబడిందని ఇంటెలిజెన్స్ లేటెస్ట్ సమాచారంతో…రక్షణ స్థావరాల భద్రతా సంస్థలు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాయి. భారత వైమానిక దళం పఠాన్‌కోట్, జమ్మూ, శ్రీనగర్, అవంతిపురాల్లోని రక్షణ స్థావరాలను హై అలర్ట్ లో ఉంచింది. ఈ ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్ కింద ఉంటుందన్న విషయం తెలిసిందే. రెడ్ అలర్ట్ అంటే మేటర్ సీరియస్ అని అర్థం. రక్షణ స్థావరాలును కాపాడేందుకు కావాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నట్లు భద్రతా సంస్థలు తెలిపాయి.