PNB Offer : పంజాబ్ నేషనల్ బ్యాంక్ బంపర్ ఆఫర్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ) కస్టమర్లకు శుభవార్త. పండుగల సీజన్‌లో పీఎన్బీ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
- bheemraj
- Published On : September 2, 2021 / 06:32 PM IST
Pnb
PNB Bumper Offer : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ) కస్టమర్లకు శుభవార్త. పండుగల సీజన్‌లో పీఎన్బీ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫెస్టివల్ బోనంజా ఆఫర్ పేరుతో తమ కస్టమర్లకు చౌకగా రుణ పరపతి కల్పిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అన్ని రకాల రుణాలపై సర్వీస్ చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలను మాఫీ చేసింది.
హోం లోన్, వెహికిల్ లోన్, మై ప్రాపర్టీ లోన్స్, పర్సనల్ లోన్స్, పెన్షన్ లోన్స్, గోల్డ్ లోన్స్‌కు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ప్రస్తుతం 6.80 శాతం వడ్డీ రేటుపై హోం లోన్స్, 7.15 శాతం వడ్డీపై కారు లోన్స్ మంజూరు చేస్తోంది. పర్సనల్ లోన్స్ పై 8.95 శాతం వసూలు చేస్తోంది.
హోం లోన్‌పై ఆకర్షణీయమైన వడ్డీతో టాపప్ రుణం అందజేస్తున్నట్లు తెలిపింది. 2021 డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఖాతాదారులు దేశ వ్యాప్తంగా తమ శాఖలు, డిజిటల్ చానెళ్ల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
