IIT Baba Marriage : పెండ్లి చేసుకున్న ఐఐటీ బాబా.. స్వగ్రామంలో ఘన స్వాగతం.. ఆ దంపతుల భవిష్యత్ ప్రణాళికలు అవేనట..
IIT Baba Marriage : యూపీలో కుంభమేళా జరిగిన సమయంలో ఐఐటీ బాబాగా ఫేమస్ అయిన అభయ్ సింగ్ పెళ్లి చేసుకున్నాడు. తన సన్యాస జీవితానికి స్వస్తి పలికి ఆయన.. కర్ణాటకు చెందిన ప్రీతిక అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ను వివాహం చేసుకున్నారు.
IIT Baba Marriage
IIT Baba Marriage : యూపీలో కుంభమేళా జరిగిన సమయంలో ఐఐటీ బాబాగా ఫేమస్ అయిన అభయ్ సింగ్ పెళ్లి చేసుకున్నారు. తన సన్యాస జీవితానికి స్వస్తి పలికి ఆయన.. కర్ణాటకు చెందిన ప్రీతిక అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ను వివాహం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని అంఘజర్ మహాదేవ్ ఆలయంలో శివరాత్రి పర్వదినాన వీరు ఒక్కటవ్వగా, ఫిబ్రవరి 19న కోర్టు మ్యారేజ్ జరిగింది. ఆ జంట ఆయన స్వస్థలమైన ఝజ్జర్ ను సందర్శించగా.. వారి వివాహ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : Gold and Silver prices fall : యుద్ధం వేళ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి..? అసలు కారణాలివే..
ఐఐటీ బాబా తన వివాహం గురించి మాట్లాడుతూ.. బెంగళూరుకు చెందిన ఇంజనీర్ ప్రతీక, నేను సుమారు ఏడాది క్రితం కలుసుకున్నాం. మా పరిచయం స్నేహంగా మొదలైంది, క్రమంగా ప్రేమగా మారిందని చెప్పారు. సింగ్ ఒక నిరాడంబరమైన వ్యక్తి. అతను నిజాయితీపరుడైన, సత్యసంధుడైన వ్యక్తి అని, తామిద్దరం కలిసి సంతోషంగా ఉన్నామని ప్రతీక పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడుతూ.. అధునిక విద్యను ఆధ్యాత్మిక బోధనలతో మేళవించే సనాతన, కేంద్రీకృత విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని తాము యోచిస్తున్నట్లు ఆ దంపతులు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఇదిలాఉంటే.. అభయ్ సింగ్ పెళ్లి చేసుకొని భార్యతో కలిసి సొంత ఇంటికి రావడంతో అతని తల్లి హారతి ఇచ్చి, మిఠాయిలు తినిపించి సాంప్రదాయ పద్దతుల్లో స్వాగతం పలికారు. ఇంటికి చేరుకున్న అభయ్ సింగ్ తో సెల్ఫీలు దిగేందుకు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
అభయ్ సింగ్ ఐఐటీ బాబా ఎలా అయ్యారు?
హర్యానకు చెందిన అభయ్ సింగ్ ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత ఆర్ట్స్ వైపు మళ్లి డిజైన్ లో మాస్టర్స్ చేశారు. అనంతరం కెనడా వెళ్లి ఏటా రూ.38లక్షల ప్యాకేజీతో మూడేళ్లపాటు ఉద్యోగం చేశారు. కానీ, అక్కడ తీవ్రమైన డిప్రెషన్ కు గురికావడంతో ఆయన స్వదేశానికి వచ్చారు. ఐటీ కెరీర్ ను వదిలేసి సన్యాసం స్వీకరించారు. 2025 మహాకుంభ్ మేళాలో సన్యాసి దుస్తుల్లో ఉన్న అతను తాను ఐఐటీలో చదివానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఒక్కసారిగా అతను ఫేమస్ అయ్యాడు. దీంతో నెటిజన్లు ఆయన్ను ఐఐటీ బాబాగా పిలవడం మొదలుపెట్టారు.
