అంత్యక్రియలు అడ్డుకున్న 60మంది పై కేసు నమోదు

  • Publish Date - April 10, 2020 / 09:24 AM IST

కరోనా వ్యాధి సోకి మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు అడ్డు తగిలిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.   పంజాబ్ లోని జలంధర్ లో ఒక వ్యక్తి శ్వాస కోస వ్యాధులతో కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో  చేరాడు. వైద్య పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. డాక్టర్లు వెంటిలేటర్ పై  ట్రీట్ మెంట్  చేసినప్పటికీ ..చికిత్స పొందుతూ…  అతడి ఆరోగ్యం క్షీణించి మరణించాడు.(చెస్ట్ ఆసుపత్రి నిర్వాకం : ఒకరిని డిశ్చార్జ్ చేయాల్సింది..కొత్తగూడెం DSPని డిశ్చార్జ్ చేశారు)

నిబంధనలకు అనుగుణంగా అధికారులు అతడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.  ఈ లోపు గ్రామస్తులు  అధికారులతో వాగ్వివాదానికి దిగారు.క కరోనా తో మరణించిన వ్యక్తికి తమ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించవద్దని అడ్డుకున్నారు. ఉన్నతాధికారులు పోలీసులు ఎంత నచ్చచెప్పినప్పటికీ వారు వినకపోగా నిరసనకు దిగారు.  

పోలీసుల సంయమనం పాటించి నచ్చ చెప్పటానికి ప్రయత్నించినా వారు వినకపోగా నిరసన తీవ్ర చేసేసరికి పోలీసులు కఠిన చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు. దీంతో అంత్యక్రియలకు అడ్డుతగిలిన 60 మందిపై కేసు నమోదు చేసినట్లు జలంధర్ పోలీసు కమీషనర్  గురుప్రీత్ సింగ్ భుల్లార్ తెలిపారు.