Punjab : పోలీసు వాహనంపై వేళ్లతో సైగలు చేస్తు యువతి ఇన్‌స్టా రీల్స్‌.. అనుమతించిన అధికారి సస్పెండ్

ఓ అమ్మాయి తన ఇన్ స్టా రీల్ కోసం పోలీసు వాహనాన్ని ఇష్టానుసారంగా వాడుకుంది. ఓ అధికారి సహకారంతో పోలీసు వాహనంపై కూర్చుని రీల్ చేసింది. అభ్యంతరకర రీతిలో వేళ్లతో సైగలు చేస్తు ఆమె చేసిన పనికి సదరు అధికారి సస్పెండ్ అయ్యారు.

Jalandhar woman insta reels on police vehicle

Jalandhar cop suspend..woman insta reels on police vehicle : ఓ అమ్మాయి ఇన్ స్టా రీల్ వల్ల పంజాబ్ లో ఓ పోలీసు అధికారి సస్పెండ్ అయ్యారు. పోలీసు వాహనంపై కూర్చుని రీల్ చేయటానిక అనుమతి ఇచ్చిన పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఈ రీల్ లో ఓ యువతి పోలీసు వాహనంపై కూర్చుని అభ్యంతరకర రీతిలో వేళ్లతో సైగలు చేస్తు రీల్ చేసింది. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాక తెగ వైరల్ అయ్యింది.అలా అది కాస్తా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో పోలీసు వాహనంపై రీల్ చేయటానికి అనుమతి ఇచ్చిన పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు.

Basangouda Patil : భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు..సుభాష్ చంద్రబోస్ : బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

పంజాబ్‌లోని జలంధర్‌ నగరంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ శర్మ సస్పెండ్ అయ్యారు. రాత్రి సమయమంలో ఓ యువతి పోలీసు వాహనంపై కూర్చుని రీల్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ఆమె పోలీసు కారు బానెట్ పై కూర్చుని విన్యాసాలు చేసింది. అంతేకాదు అభ్యంతరక రీతిలో వేళ్లు చూపిస్తు సైగలు చేసింది. అలా ఆమె చేసిన రీల్ ను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. అదికాస్తా వైరల్ అయింది. దీంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించిన రీల్ కు అనుమతి ఇచ్చిన అశోక్ శర్మను సస్పెండ్ చేశారు.

Belly Dance In Local train : లోకల్ ట్రైన్‌లో యువతి బెల్లీ డ్యాన్స్ .. మండిపడుతున్న నెటిజన్లు

 

ట్రెండింగ్ వార్తలు