భారతదేశంలో విధ్వంసం సృష్టించాలని అనుకుంటున్న ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి భారత బలగాలు. ఇటీవలే పలు కుట్రలను చేధించిన పోలీసులు..తాజాగా మరోకటి బయటపడింది. టెర్రరిస్టుల భారీ కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. KZF (ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్) ఉగ్ర సంస్థకు చెందిన భారీ మందుగుండు సామాగ్రీని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఐదు AK 47, పిస్టళ్లు, ఉపగ్రహ ఫోన్లు, గ్రనేడ్లు, ఇతర సామాగ్రీ ఉన్నాయి. సరిహద్దుల్లో ఆయుధాలను సరఫరా చేసేందుకు ఉగ్రవాదులు డ్రోన్లను ఉపయోగించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించిన విచారణనను NIAకు అప్పగించేందుకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నిర్ణయించారు. పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఏవైనా ఉగ్రవాదుల దాడులు జరగవచ్చేమోన్న అనుమానంతో పర్యవేక్షణ చేయించాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై డీజీపీ దినకర్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ఇండియన్ – పాక్ సరిహద్దుల్లో ఐఎస్ఐ ద్వారా డ్రోన్లను ఉపయోగించి..ఆయుధాలను సరఫరా చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
నిఘా వర్గాల హెచ్చరికలతో ఆపరేషన్ చేపట్టామన్నారు. కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో నిషేధిత ఉగ్రవాదులు కుట్ర ప్రణాళికలు రచించాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాశ్మీర్‌లో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలతో పెద్దఎత్తున్న ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
Read More : Howdy Modi : మోడీకి ప్రవాస భారతీయుల జేజేలు