Python : కోతిని మింగిన కొండచిలువ

కోతిని మింగిన కొండచిలువ కదల్లేని స్థితిలో అటవీ శాఖ అధికారుల కంటపడింది. గుజరాత్ లోని వడోదర సమీపంలో ఉన్న చిన్న నదిలో కొండచిలువను గుర్తించిన అధికారులు దానిని బయటకు తీశారు.

Python

Python : కోతిని మింగిన కొండచిలువ కదల్లేని స్థితిలో అటవీ శాఖ అధికారుల కంటపడింది. గుజరాత్ లోని వడోదర సమీపంలో ఉన్న చిన్న నదిలో కొండచిలువను గుర్తించిన అధికారులు దానిని బయటకు తీశారు.

ఒడ్డుకు తెచ్చిన కొద్దిసేపటికే కడుపులో ఉన్న కోతిని వాంతి ద్వారా బయటపడేసింది. అప్పటివరకు కదల్లేని స్థితిలో ఉన్న కొండచిలువ కోతిని బయటకు వేయగానే అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేసింది.

ఇదే సమయంలో దాని ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన అధికారులు బాగానే ఉందని తెలిపారు. ఈ కొండచిలువను బోనులో సురక్షితంగా ఉంచినట్టు వెల్లడించారు. అటవీశాఖ అనుమతి పొందిన తర్వాత జంబుగోడా వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ కొండచిలువను విడుదల చేస్తామన్నారు.

శ్రీకాళహస్తీశ్వరాలయం సమీపంలో ఇటువంటి ఘటన మరొకటి జరిగింది. కొండ చిలువ అటు ,ఇటు ముందుకు కదలలేని స్ధితిలో అక్కడే ఉండటంతో దీనిని ఆలయ సిబ్బంది గమనించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. మేక పిల్లను బయటకు తీసేందుకు కొండచిలువ చాలా సేపు ఉక్కిరిబిక్కిరైంది. కొండచిలువ మింగిన మేకను బయటకు కక్కుతున్న దృశ్యాలను వారంతా వింతగా చూశారు. అటవీ సిబ్బంది కొండ చిలువను పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళి వదిలిపెట్టారు.