×
Ad

Ram Mandir QR code scam : రామమందిరం పేరిట క్యూఆర్ కోడ్ స్కాం…హిందూ సంస్థల హెచ్చరిక

అయోధ్యలో రామ మందిరానికి మహా సంప్రోక్షణ మహోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆలయం పేరుతో భక్తులను దోచుకునే షాకింగ్ ముఠా బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది....

  • Published On : January 1, 2024 / 05:33 AM IST

Ram Mandir

Ram Mandir QR code scam : అయోధ్యలో రామ మందిరానికి మహా సంప్రోక్షణ మహోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆలయం పేరుతో భక్తులను దోచుకునే షాకింగ్ ముఠా బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు ఆలయం పేరుతో విరాళాలు ఇవ్వాలని కోరుతూ సోషల్ మీడియాలో సందేశాలు పెట్టారని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హెచ్చరించింది. ఈ సందేశాలకు క్యూఆర్ కోడ్ కూడా ఉంది. స్కాన్ చేసి చెల్లించిన డబ్బు మోసగాళ్లకు చేరుతోందని వీహెచ్‌పీ తెలిపింది.

ALSO READ : Union Home Minister Amit Shah : తెహ్రీక్ ఏ హురియత్ సంస్థపై కేంద్రం బహిష్కరణ వేటు

ఈ బాగోతంపై ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని హోం మంత్రిత్వ శాఖ, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం, ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ట్రస్ట్, నిధులు సేకరించడానికి ఎవరికీ అధికారం ఇవ్వలేదని ఆయన చెప్పారు.

ALSO READ : Union Home Minister Amit Shah : తెహ్రీక్ ఏ హురియత్ సంస్థపై కేంద్రం బహిష్కరణ వేటు

ఆలయానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా సామాజిక మాధ్యమాల్లో సందేశాలు, ఫోన్ కాల్స్ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాల్‌ను స్వీకరించిన వారిలో ఒకరు వీహెచ్‌పీ కార్యకర్తలతో నంబర్‌ను పంచుకున్నారు. ఓ వీహెచ్‌పీ కార్యకర్త ఆ నంబర్‌కు ఫోన్ చేయడంతో మోసగాళ్ల వ్యూహాలు బయటపడ్డాయి.

https://twitter.com/vinod_bansal/status/1741334321120854430