Azadi Ka Amrut Mahotsav’ : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాల్లో క్విట్ ఇండియా ఉద్యమం గురించి ప్రదర్శన

బ్రిటీష్ తెల్లదొరల కబందహస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను నిర్వహిస్తున్నారు.

Azadi Ka Amrut Mahotsav’ : బ్రిటీష్ తెల్లదొరల కబందహస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఈ వేడుకల గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ‘ఆజాది కి అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమాలు 75 వారాల పాటు కొనసాగుతాయని..ఈ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమం గురించి ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శన నవంబర్ వరకు కొనసాగుతుందని..‘ఆజాది కి అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ మహోత్సవ్‌ ఏడాదిన్నర పాటు 75 వారాలు కొనసాగనున్నాయని వివరించారు. గ్రామస్థాయిలో సర్పంచులు కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ జాతీయగీతం పాడి రాష్ట్ర గీత్ వెబ్ సైట్ లో ఉంచాలని సూచించారు. 2047 నాటికి దేశం ఏ స్థాయికి చేరాలో తమ అభిప్రాయాలను పంచుకోవాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు