Rahul Gandhi Bharat Jodo Yatra
Bharat Jodo Yatra: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతోంది. యాత్రకు శనివారం విరామం ప్రకటించిన రాహుల్ గాంధీ.. ఆదివారం తెల్లవారు జామున యాత్రను పున: ప్రారంభించారు.
Rahul Gandhi Bharat Jodo Yatra
ఆదివారం ఉదయం 7గంటలకు జమ్ము డివిజన్‌లోని కతువా జిల్లాలోని హిరనగర్ నుంచి యాత్ర మొదలైంది. ఉదయం 8గంటలకు సాంబ జిల్లాలోకి భారత్ జోడో యాత్ర చేరుకుంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ వెంట యాత్రలో పాల్గొన్నారు.
Rahul Gandhi Bharat Jodo Yatra
రాహుల్ గాంధీ పలు ప్రాంతాల్లో ఆగుతూ స్థానికులతో ముచ్చటిస్తూ ముందుకు సాగారు. ఆదివారం దాదాపు 23 కిలో మీటర్ల మేర యాత్ర సాగనుంది. రాత్రి చక్ నానక్ వద్ద రాహుల్ బస చేస్తారు.
Rahul Gandhi Bharat Jodo Yatra
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో జమ్ముకశ్మీర్ పార్టీ అధ్యక్షుడు వికార్ రసూల్ వని, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ్ భల్లాతో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Rahul Gandhi Bharat Jodo Yatra
రాహుల్ పాదయాత్ర చేస్తున్న ప్రాంతం పాక్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉండటంతో భారత్ జోడో యాత్రకు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. అడుగడుగునా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పఠాన్ కోట్ హైవేనుసైతం మూసివేశారు.
Rahul Gandhi Bharat Jodo Yatra
ఇదిలాఉంటే భద్రతా కారణాల రిత్యా ఏఏ రూట్లలో రాహుల్ పాదయాత్ర కొనసాగాలో అధికారుల సూచనలు చేయనున్నారు. అయితే, ఈనెల 30నాటికి భారత్ జోడో యాత్ర ముగిసే అవకాశం ఉంది.