Rahul Gandhi : పార్లమెంట్‌లో దాడికి కారణం దేశంలో నిరుద్యోగమే : రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో దాడికి కారణం దేశంలో నిరుద్యోగం పెరిగిపోవటమే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. నిరుద్యోగం వల్లే యువకులు పార్లమెంట్ లో దాడికి పాల్పడ్డారని అన్నారు.

INDIA bloc protest at Jantar Mantar.. Rahul Gandhi : పార్లమెంట్‌లో దాడికి కారణం దేశంలో నిరుద్యోగం పెరిగిపోవటమే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. నిరుద్యోగం వల్లే యువకులు పార్లమెంట్ లో దాడికి పాల్పడటానికి కారణమన్నారు. అందరు పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన దాడి గురించే మాట్లాడుకుంటున్నారని కానీ..దేశంలో నిరుద్యోగం గురించి ఎవరు మాట్లాడటంలేదన్నారు. దేశంలో నిరుద్యోగం గురించి మాట్లాడని మీడియా పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల గురించే మాట్లాడుతోంది అన్నారు. సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ బయట కూర్చుంటే ..తాను వీడియోలు రికార్డు చేయటాన్ని మాత్రం ప్రసారాలు చేస్తోంది అంటూ దుయ్యబట్టారు. ప్రతీ ఒక్కరికి మాట్లాడే హక్కు ఉందన్నారు.

కాగా పార్లమెంట్ ఉభయ సభల నుంచి చరిత్రలో ఎన్నడు జరగని విధంగా 146మంది ఎంపీలు సస్పెండ్ అయిన ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తు ఇండియా కూటమి ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే పేరుతో దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంట్లో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటిమికి చెందిన పలువురు ప్రముఖ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీలు,సీనియర్ నేతలు హాజరయ్యారు. నేతలంతా ఒకే వేదికను పంచుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరు కలిసి కట్టుగా పనిచేస్తామని ప్రతినపూనారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శరత్ పవార్,సీతారామ్ ఏచూరి సహా పలువురు ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు.