Rahul Gandhi : ఏ కల పెద్దది కాదు, చిన్నారిని ఫ్లైట్ ఎక్కించిన రాహుల్..వీడియో వైరల్

కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలోని ఐరవాతి వద్ద 9 ఏళ్ల బాలుడు అద్వైతతో రాహుల్ గాంధీ ముచ్చటించారు.

Kerala boy : రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత. మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు చెమటోడుస్తున్నారు. ఇంతకు ముందు లాగా కాకుండా..భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. వారితో కలిసిపోతున్నారు. తింటున్నారు. ఆడుతున్నారు. తిరుగుతున్నారు. వారితో పాటే ప్రయాణీస్తూ హల్ చల్ చేస్తున్నారు. కేరళ రాష్ట్రంలో పర్యటించిన ఈ లీడర్ ప్రజలతో సహపంక్తి భోజనం చేశారు. సముద్రంలో ఈ కొట్టారు. మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు. తాజాగా…ఓ చిన్నారిని ఫ్లైట్ ఎక్కించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు రాహుల్.

కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలోని ఐరవాతి వద్ద 9 ఏళ్ల బాలుడు అద్వైతతో ముచ్చటించారు. అతని తల్లిదండ్రులను కలిశారు. అద్వైతతో మాట్లాడుతున్న సందర్భంలో…ఏం చదువుతున్నావ్, ఏం అవ్వాలని అనుకుంటున్నావ్ అని రాహుల్ అడిగారు. పైలట్ అవ్వాలని అనుకుంటున్నా..తనకు ఎగరాలని ఉందని..అందుకే పైలట్ కావాలని అనుకుంటున్నట్లు అద్వైత బదులిచ్చాడు. మరుసటి రోజు…అద్వైత్ కోసం రాహుల్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాలికట్ విమానాశ్రయానికి తీసుకెళ్లాడు. అక్కడ విమానం ఎక్కించారు.

పైలట్ తో కలిసి కాక్ పిట్ గురించి చిన్నారికి వివరంగా చెప్పారు. అద్వైత శ్రద్ధగా వింటున్న వీడియోను రాహుల్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేశారు. ఏ కల పెద్దది కాదు..అద్వైత్ తన కలను నిజం చేసుకొనేందుకు మేం చిన్న సాయం చేశాం..ఇప్పుడు అతడు ఎగరడానికి అన్ని అవకాశాలు లభించే సమాజాన్ని, వ్యవస్థలను సృష్టించాల్సిన బాధ్యత మనదే అని రాహుల్ చెప్పుకొచ్చారు.


Read More : Covid-19 : మహారాష్ట్ర, ముంబైలో కరోనా..పూణెలో ఆసుపత్రులు, బెడ్స్ ఫుల్,

ట్రెండింగ్ వార్తలు