కెమెరామెన్ కు చేయి అందించిన రాహుల్

ఒడిషాలో ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించేందుకు  శుక్రవారం(జనవరి 25, 2019) ఒడిషా రాజధాని భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అయితే ఈ సమయంలో రాహుల్ పర్యటనను కవర్ చేసేందుకు వెళ్లిన ఓ కెమెరామెన్ మెన్ మెట్లపై నుంచి ఒక్కసారిగా జారి కిందకు పడిపోయాడు. తల కిందులుగా అతడు పడిపోవడంతో ఒక్కసారిగా అందరూ అతడికి ఏమైందోనని భయపడ్డారు.

వెంటనే పక్కన వెళుతున్న రాహుల్ గాంధీ అతడి చేయి అందించి  లేవదీశాడు. ఇంతలో రాహుల్ పక్కనున్న వారందరూ వచ్చి అతడికి సాయం చేశారు. ఒడిషాలో పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఒడిశాలో రాహుల్ పర్యటిస్తున్నారు.