Rahul Gandhi: గోల్డెన్ టెంపుల్లో రాహుల్ గాంధీ ‘సేవ’

కొంతకాలంగా పంజాబ్ లో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో..

Rahul Gandhi

Golden Temple: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ పంజాబ్‌లోని అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్లో సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సిక్కులతో కలిసి ప్రార్థనలు కూడా చేశారు. అమృత్‌సర్ లో రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటనలో ఉన్నారని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తెలిపారు.

కొంతకాలంగా పంజాబ్ లో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 2015 డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసు విషయంలో కాంగ్రెస్-ఆప్ మధ్య గొడవ చెలరేగుతున్న సమయంలోనే రాహుల్ పంజాబ్ లో పర్యటిస్తుండడం గమనార్హం.


Rahul Gandhi

కాగా, రాహుల్ గాంధీ ఇటీవల పలు ప్రాంతాల్లో పర్యటించి సామాన్యులతో సంభాషించి, కూలీ పనులు కూడా చేశారు. ఇటీవల రైల్వే స్టేషన్ లో హమాలీగా మూటలు మోశారు. మరో ప్రాంతంలో కార్పెంటర్ గా మారి తలుపులు, కిటికీలు చేసే పని చేశారు.


Pothina Mahesh: పవన్ కల్యాణ్ చేస్తున్న వారాహి యాత్రను అడ్డుకుంటే ఊరుకోము: జనసేన