Rahul Gandhi : కర్ణాటకలో ప్రేమ దుకాణం తెరుచుకుంది.. ప్రతి రాష్ట్రంలో ఇదే రిపీట్ అవుతుంది

ప్రేమతో కర్ణాటక ప్రజల మనస్సులు గెలుచుకున్నాం. కన్నడ ప్రజలు కాంగ్రెస్ కు మంచి విజయాన్ని ఇచ్చారు. పేద ప్రజల శక్తి పెట్టుబడిదారుల బలాన్ని ఓడించింది. ఈ విజయం ప్రతీ రాష్ట్రానికి చేరుతుందని..కర్ణాటకలో విజయం ఒక ప్రతీ రాష్ట్రంలోను ఉంటుందని రాహుల్ గాంధీ అన్నారు.

Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం ఖరారు అయ్యింది. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కాంగ్రెస్ యత్నాలు చేసుకుంటోంది. ఈ ఘనవిజయంపై కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తంచేశారు. ఈ విషయంపై స్పందిస్తు.. కర్ణాటక ప్రజలకు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం అందరి విజయం అని అన్నారు. ముఖ్యంగా కర్ణాటక ప్రజల విజయం అంటూ ప్రశంసించారు. కర్ణాటకలో విద్వేష రాజకీయం ఓడిందని ప్రేమ గెలిచిందని అన్నారు.

ప్రేమతో కర్ణాటక ప్రజల మనస్సులు గెలుచుకున్నామని, ఆ ప్రేమతోనే కన్నడ ప్రజలు కాంగ్రెస్ కు ఈ విజయాన్ని ఇచ్చారంటూ రాహుల్ గాంధీ అన్నారు. పేద ప్రజల శక్తి పెట్టుబడిదారుల బలాన్ని ఓడించిందన్నారు. ఈ విజయం ప్రతీ రాష్ట్రానికి చేరుతుందని.. కర్ణాటకలో విజయం ఒక ప్రతీ రాష్ట్రంలోను ఉంటుందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పేద ప్రజలు పక్షాన నిలిచింది..  ఆ పోరాటాన్ని కన్నడ ప్రజలు అర్థం చేసుకుని కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు.

కర్ణాటక ఎన్నికల్లో ద్వేషంతో పోటీ చేయలేదు.. ప్రేమతో పోరాడామన్నారు. ప్రేమ ఈ దేశానికి బావుంటుందని ప్రజలు చూపించారని ఓ పక్క క్రోనీ క్యాపిటలిజయం, మరో పక్క ప్రజలు.. దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో విద్వేష బాజార్ మూతపడిందని.. ప్రేమ దుకాణం తెరుచుకుంది అంటూ ఛమక్కులు విసిరారు రాహుల్. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన ఐదు హామీలను తొలి కేబినెట్ లో నెరవేరుస్తాం అని హామీ ఇచ్చారు. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన కర్ణాటక ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. పార్టీ తరపున ముఖ్యమంత్రిని అభ్యర్థిని ఎన్నికలకు ముందు ప్రకటించకపోవటంతో సీఎం రేసులో ముఖ్యంగా కర్ణాటక పీసీసీ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్యలు ఉన్నారు. పార్టీ విజయం ఖరారు కావడంతో ముఖ్యమంత్రి అభ్యర్థిపై అనేక అంచనాలు వస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తేల్చి చెప్పారు. మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా అదే విషయాన్ని స్పష్టంచేశారు. మరి సీఎం పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారు అనేదానిపై ఆసక్తి నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు