ఇండియాలో నాలుగు దశల లాక్‌డౌన్ విఫలమైందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కరోనావైరస్‌తో యుద్ధం చేయడానికి ప్లాన్ బి ఏమిటి అని కేంద్రాన్ని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. రెండు నెలలుగా భారతదేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్నా కూడా కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు.
లాక్‌డౌన్ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, కరోనావైరస్ సంక్షోభాన్ని పరిష్కరించే వ్యూహం ఏంటో చెప్పాలని రాహుల్ గాంధీ కోరారు. నాలుగు దశల లాక్‌డౌన్‌లో ఆశించిన ఫలితాలు నెరవేరలేదని, ఇప్పుడు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు అని రాహుల్ అడిగారు.
మే నెల చివర వరకు వైరస్ తగ్గుదల ఉంటుందని ప్రభుత్వం పేర్కొన్నదని, కానీ వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నారని ఆయన అన్నారు. వ్యాధి కేసులు పెరుగుతున్నాయని, తగ్గుముఖం పట్టట్లేదని అన్నారు. వైరస్ విపరీతంగా పెరుగుతున్నా కూడా లాక్‌డౌన్ తొలగిస్తున్న ఏకైక దేశం భారతదేశమని రాహుల్ అన్నారు.
కేంద్రం తన ప్లాన్-బి ఏమిటనే విషయాన్ని బహిర్గతం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలను నడుపుతోందని, ఈ సంక్షోభంలో మనుగడ సాగించడానికి పేదలకు ప్రత్యక్ష నగదు ఆయా రాష్ట్రాలు ఇస్తున్నాయని, ఆ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు మాత్రం లభించట్లేదని అన్నారు రాహుల్. కేంద్రం మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే రాష్ట్రాలకు కూడా కేంద్రం మద్దతు ఇవ్వాలని అన్నారు.
Read: మండువేసవిలోనూ వణుకుతున్న అస్సోం: ఒకవైపు కరోనా..మరోవైపు వరదలు