Rahul Gandhi Speech in Loksabha
Rahul Gandhi Speech: నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండో చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నారు. ఈరోజు మెదడుతో కాదు మనసుతో మాట్లాడాలనుకుంటున్నా అంటూ రాహుల్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. రాహుల్ ప్రసంగం ప్రారంభించగానే అధికార బీజేపీ సభ్యులు సభలో గందరగోళం రేపారు. దీనికి రాహుల్ స్పందిస్తూ ఈరోజు మీపై ఎదురుదాడి చేయను, అదానీ గురించి మాట్లాడను అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించినందుకు కృతజ్ఞతలు స్పీకర్ కు తెలిపారు. అదాని వ్యవహారంపై పార్లమెంట్ లో మాట్లాడినందుకు అధికార పక్షానికి కష్టం కలిగిందని, అదాని విషయంలో తాను నిజమే మాట్లాడా నని చెప్పారు. అయితే ఈరోజు బీజేపీ భయపడాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.
రాహుల్ ఇంకా ఏమన్నారంటే..
గత సంవత్సరం 130 రోజుల పాటు దేశంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు పాదయాత్ర చేశాను
సముద్ర తీరం నుంచి పర్వత శ్రేణుల వరకు వెళ్లాను, ఈ యాత్ర ఇంకా ముగియలేదు
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎందుకు నడుస్తున్నావని నన్ను అడిగారు
ఎందుకు నడుస్తున్నానో ఆ సమయంలో నాకు కూడా పూర్తిగా తెలియదు
మొదట్లో నేను అహంకారంతో నడక మొదలుపెట్టాను
రెండు మూడు రోజుల్లోనే ఆ అహంకారం పటాపంచలైంది
నాకున్న మోకాలు నొప్పి తిరగబెట్టింది..
ఆ నొప్పిని భరించలేకయా.. ఎలా నడిచానో నాకే తెలియదు
అయితే నాతో వచ్చిన జనం నన్ను నడిపించారు
ఈ దేశం గళం వినాలనుకుంటే మనలో ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టాలి
అప్పుడే ఈ దేశం ఏం కోరుకుంటుందో తెలుస్తుంది
కొన్ని రోజుల క్రితమే నేను మణిపుర్ వెళ్లాను.. కానీ ప్రధానమంత్రి ఇంతవరకు మణిపుర్ వెళ్లలేదు
మణిపుర్ ను మీరు రెండు భాగాలు చేశారు.. రెండు ముక్కలుగా విడగొట్టారు
ఈ దేశం గళం వినాలనుకుంటే మనలో ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టాలి
అప్పుడే ఈ దేశం ఏం కోరుకుంటుందో తెలుస్తుంది
కొన్ని రోజుల క్రితమే నేను మణిపుర్ వెళ్లాను.. కానీ ప్రధానమంత్రి ఇంతవరకు మణిపుర్ వెళ్లలేదు
మణిపుర్ ను మీరు రెండు భాగాలు చేశారు.. రెండు ముక్కలుగా విడగొట్టారు
మణిపుర్ క్యాంపుల్లో మహిళలు, పిల్లలతో మాట్లాడాను.. కానీ ప్రధాని ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదు
నేను ఓ మహిళతో మాట్లాడా… ఒక్కగానొక్క కొడుకును తన కళ్ల ముందే కాల్చిచంపారని ఆమె చెప్పారు
భయంతో ఒక రాత్రి మొత్తం తన కొడుకు శవం దగ్గరే కూర్చున్నానని ఆమె బాధపడ్డారు
తన సర్వస్వం నాశనం చేస్తారని భయం వేసిందని బాధితురాలు వెల్లడించారు
హిందుస్థాన్ ను హత్య చేశారు.. మణిపుర్ లో భారతతత్వాన్నే మర్డర్ చేశారు
భారత్ అనేది మనందరి స్వరం.. ఆ గళాన్ని మణిపుర్ లో చంపేశారు
అంటే మీరు మణిపుర్ లో భరతమాతను హత్య చేశారు.. మీరు దేశ భక్తులు కాదు, దేశద్రోహులు
మణిపుర్ ప్రజల గోడు ప్రధాని వినరు.. ఆయన కేవలం ఇద్దరు వ్యక్తుల మాట మాత్రమే వింటారు
స్మృతి ఇరానీ కౌంటర్
మణిపుర్ లో భరతమాతను హత్య చేశారన్న వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ సభ్యులు సభా కార్యకలాపాలను స్తంభింపజేశారు. మంత్రి స్మృతి ఇరానీ జోక్యం చేసుకుని భారత దేశాన్ని ఎవరు విడగొట్టలేరంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మణిపుర్ పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షమే పారిపోతోందని దుయ్యబట్టారు.
రాజస్థాన్ కు రాహుల్
లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించిన తర్వాత రాహుల్ గాంధీ రాజస్థాన్ కు పయనమయ్యారు. పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడకుండానే ఆయన హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.