Rahul Gandhi: లక్ష స్కూళ్లను మూసేశారు.. ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు.. ఇండోర్‌ సభలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు

ప్రశ్నించకూడదని భావించే ఒక వ్యవస్థ దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

rahul gandhi student interaction indore job recruitment issues

Rahul Gandhi: దేశ భవిష్యత్తుకు విద్యార్థులే మూలస్తంభాలని, అయితే వారు ప్రశ్నించకూడదని భావించే ఒక వ్యవస్థ ప్రస్తుతం దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో ఏర్పాటు చేసిన ‘ఛాత్రోకీ గూంజ్’ పబ్లిక్ సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులు, నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల హక్కులను, వారి స్వేచ్ఛను అణచివేస్తున్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ అన్యాయమైన వ్యవస్థను ధైర్యంగా ప్రశ్నించే వారిని కొందరు ఉద్దేశపూర్వకంగా, గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.

AP Rains: ఏపీకి తుఫాను ముప్పు.. బలపడుతున్న అల్పపీడనం.. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు!

జాతీయ భద్రతా సలహాదారుపై ఆరోపణలు.. సోషల్ మీడియా నియంత్రణ:

ఈ సభ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు అనేక వ్యవస్థలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నియంత్రిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యక్తీకరించే అభిప్రాయాలపై కూడా నిఘా కార్యకలాపాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం దెబ్బతింటోందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఆవేదన.. ఎంపీపీఎస్సీ అక్రమాలు, నియామకాల నిలిపివేత:

ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు తమ సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీపీఎస్సీ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు తమపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని దేవాస్‌కు చెందిన ఒక విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 13 శాతం కోటాను నిలిపివేయడం వల్ల వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని విద్యార్థులు ఆయన వద్ద ప్రస్తావించారు.