రాహుల్‌కి తప్పిన ప్రమాదం : ఫ్లైట్‌లో టెక్నికల్ ప్రాబ్లం

  • Publish Date - April 26, 2019 / 05:37 AM IST

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో టెక్నికల్ సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని ఢిల్లీలో ఎయిర్ పోర్టులో పైలట్లు ల్యాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్..ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తాను ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడిందని..దీనివల్ల తిరిగి ఢిల్లీకి వెళుతున్నట్లు రాహుల్ తెలిపారు. దీనివల్ల ఎన్నికల సభలు ఆలస్యం జరుగుతాయని..ఈ అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. 
Also Read : మోడీ చాపర్ చెక్ చేసిన IAS సస్పెండ్…స్టే విధించిన క్యాట్

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాహుల్ దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం బీహార్‌లోని సమస్తిపూర్, ఒడిశాలోని బాలాసోర్, మహారాష్ట్రలోని సంగంవేర్‌లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు.

ఉదయం విమానంలో పాట్నాకు బయలుదేరడానికి రాహుల్ సిద్ధమయ్యారు. కానీ కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. రాహుల్‌తో పాటు పార్టీ నేతలు కూడా ఉన్నారు. దీంతో వేరే విమానం ద్వారా రాహుల్‌ని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు.

Also Read : ECకి చంద్రబాబు లేఖ : ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు