Bharat Jodo Yatra: ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ హెచ్చరిక

దేశంలోని బహుళత్వం, వైవిద్ధ్యాలపై దాడి జరుగుతోంది. మత, జాతి, ప్రాంతీయ విభేదాలు సృష్టించి, దేశాన్ని విడదీసేందుకు విభజన శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ విభజన శక్తులు కేవలం వేళ్లపై లెక్కించగలిగినంత మందే ఉన్నారు. ప్రజలు అభద్రతా భావం, భయాందోళనలో ఉన్నపుడు మాత్రమే ఇతరుల పట్ల విద్వేష బీజాలను నాటగలమని వారికి తెలుసు

Bharat Jodo Yatra: దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ సంక్షోభానికి కారణం కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమని ఆయన అన్నారు. నిరుద్యోగం, భరించలేని ధరల పెరుగుదల, వ్యవసాయ రంగంలో ఒడుదొడుకులకు తోడు దేశ సంపదను కార్పొరేట్ దిగ్గజాలు కబ్జా చేయడం వల్ల దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని రాహుల్ అన్నారు. భారత్ జోడో యాత్ర ముగింపు దశలో ఉంది. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ యాత్ర నుంచి దేశ ప్రజలకు లేఖ రాసిన రాహుల్.. పై విధమైన హెచ్చరిక చేశారు.

Sharad Yadav: నిఖార్సైన సోషలిస్ట్ నాయకుడు శరద్ యాదవ్

‘‘స్పష్టమైన ఆర్థిక సంక్షోభం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. నిరుద్యోగం, తీవ్ర స్థాయిలో ధరల పెరుగుదల, వ్యవసాయ రంగంలో తీవ్రమైన ఒడుదొడుకులు, దేశ సంపదను కార్పొరేట్ దిగ్గజాలు పూర్తిగా ఆక్రమించేయడం మనకు కనిపిస్తూనే ఉంది. ఉపాధి కోల్పోతామనే భయం ప్రజల్లో ఉంది. వారి ఆదాయాలు మరింత తగ్గిపోతున్నాయి. మెరుగైన భవిష్యత్తు కోసం వారు కంటున్న కలలు భస్మమవుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరాశావాదం పెరిగి పెద్దదవుతోంది’’ అని దేశ ప్రజలకు రాసిన లేఖలో రాహుల్ పేర్కొన్నారు.

Rajasthan: కాంగ్రస్‭‭ పార్టీని కలవరపెడుతున్న సచిన్ పైలట్ సోలో క్యాంపెయిన్స్

‘‘దేశంలోని బహుళత్వం, వైవిద్ధ్యాలపై దాడి జరుగుతోంది. మత, జాతి, ప్రాంతీయ విభేదాలు సృష్టించి, దేశాన్ని విడదీసేందుకు విభజన శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ విభజన శక్తులు కేవలం వేళ్లపై లెక్కించగలిగినంత మందే ఉన్నారు. ప్రజలు అభద్రతా భావం, భయాందోళనలో ఉన్నపుడు మాత్రమే ఇతరుల పట్ల విద్వేష బీజాలను నాటగలమని వారికి తెలుసు. ఈ దుష్ట ఎజెండాకు దాని పరిమితులు దానికి ఉన్నాయి. ఇక ఎంతో కాలం ఇది సాగదని భారత్ జోడో యాత్ర తర్వాత నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ దుష్టశక్తులపై వీథుల నుంచి పార్లమెంటు వరకు పోరాడటానికి నేను సిద్ధం’’ అని రాహుల్ భరోసా ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు