Rajasthan: కాంగ్రెస్‭‭ పార్టీని కలవరపెడుతున్న సచిన్ పైలట్ సోలో క్యాంపెయిన్స్

కాంగ్రెస్ పార్టీ చీలిక గురించి రాజస్థాన్ ప్రజలకు తెలియనిది కాదు కానీ, పార్టీలోనే ఐక్యత లేదని వారు భావిస్తే వచ్చే ఎన్నికల్లో భారీగా నష్టం జరుగుతుందని అంటున్నారు. దీన్ని కనుక విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. పైలట్, గెహ్లాట్ మధ్య సయోధ్య కుదర్చడానికి హైకమాండ్ చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు.

Rajasthan: కాంగ్రెస్‭‭ పార్టీని కలవరపెడుతున్న సచిన్ పైలట్ సోలో క్యాంపెయిన్స్

Sachin Pilot's solo campaign is troubling the Congress party

Rajasthan: రాజస్థాన్ కాంగ్రెస్ అగ్రనేతల మధ్య వివాదం ముగియడం లేదు. వాస్తవానికి ఈ వివాదం ఈనాటిది కాదు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం వరకు బాగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే తీవ్ర స్థాయికి చేరింది. తిరుగుబాటు, హైకమాండ్ చర్యలు, తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చి ప్రభుత్వం స్థిరత్వాన్ని సాధించినప్పటికీ, పార్టీలో ఏర్పడ్డ వర్గాలు మాత్రం రెండుగా చీలిపోయే ఉన్నాయి. ఏదో సందర్భంలో ఇరు వర్గాలు తమ మధ్య ఆధిపత్య పోరును కనబరుస్తూనే వస్తున్నారు.

Sharad Yadav: శరద్ యాదవ్ చొరవ చూపకపోతే లాలూ ప్రసాద్ యాదవ్‭ ముఖ్యమంత్రి అయ్యేవారే కాదు

ఈ రెండు వర్గాల్లో ఒకటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గం కాగా, రెండవది మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం. సచిన్ పైలట్ మీద సమయం దొరికినప్పుడల్లా గెహ్లాట్ తీవ్రంగా దాడి చేస్తూనే ఉన్నారు. ఇక సచిన్ బహిరంగంగా ఏమీ అనకపోయినప్పటికీ, ఆయన వర్గం మాత్రం గెహ్లాట్‭కు సవాల్ విసురుతూనే ఉంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇరు నేతలు చేతులు జోడించి అభివాదం చేశారు. తమ మధ్య ఎన్ని కలహాలు ఉన్నప్పటికీ పార్టీ కోసం కలిసి పని చేస్తామని ప్రకటించారు.

Sharad Yadav: నిఖార్సైన సోషలిస్ట్ నాయకుడు శరద్ యాదవ్

అయితే ఆ ప్రకటనలు రాహుల్ యాత్ర ముగిసే వరకే కనిపించాయి. కానీ ఇరు వర్గాల పోరు మాత్రం తగ్గలేదు. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికి ఉన్న ఆందోళనకు తోడు కాంగ్రెస్ పార్టీకి తాజాగా మరో ఆందోళన వచ్చి చేరింది. సచిన్ పైలట్ తన వర్గంతో ఏకబిగిన ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పేరుతోనే చేస్తున్నప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటున్నాను.

OPS: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం.. పాత పెన్షన్ విధానికి కేబినెట్ ఆమోదం

అయితే కాంగ్రెస్ పార్టీ చీలిక గురించి రాజస్థాన్ ప్రజలకు తెలియనిది కాదు కానీ, పార్టీలోనే ఐక్యత లేదని వారు భావిస్తే వచ్చే ఎన్నికల్లో భారీగా నష్టం జరుగుతుందని అంటున్నారు. దీన్ని కనుక విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. పైలట్, గెహ్లాట్ మధ్య సయోధ్య కుదర్చడానికి హైకమాండ్ చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. సరి కదా, రోజు రోజుకూ రెండు గ్రూపుల మధ్య దూరం మరింత పెరుగుతోంది. కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నట్లు వచ్చే ఎన్నికల్లో ఇది ఎంత మేరకు ప్రభావం చూపనుందో చూడాలి.