Bharat Jodo Yatra: సోనియాతో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేసిన రాహుల్

భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో కార్యకర్తల్లో కొత్త ఊపు వచ్చింది. బహుశా రాహుల్ గాంధీపై గతంలో ఉన్న నమ్మకాలు ఒక్కొక్కటిగా పటాపంచలు అవుతున్నట్టు ఉన్నాయి. సొంత పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుండడంతో.. ఈ ఊపు మరింత ఎక్కువైంది. రాహుల్ యాత్ర ప్రారంభించనప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆదరణ పెరిగింది

Bharat Jodo Yatra: విధ్వేషాన్ని వెదజల్లుతున్న బజారులో ప్రేమను పంచే దుకాణం తెరుస్తున్నానంటూ భారత్ జోడో యాత్ర గురించి కొద్ది రోజుల క్రితం చెప్పిన రాహుల్ గాంధీ.. ఆ ప్రేమను తన తల్లి సోనియా గాంధీ నుంచి పొందినట్లు తాజాగా వెల్లడించారు. శనివారం తన ట్విట్టర్ ఖాతాలో తన తల్లిని ప్రేమగా హత్తుకున్న ఫొటోను షేర్ చేసిన రాహుల్.. ఈ విషయమై ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘ఆమె నుంచి పొందిన ప్రేమను, దేశానికి పంచుతున్నాను’’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు.

Kerala Govt : విద్యార్థినిల‌కు 60 రోజుల మెట‌ర్నిటీ లీవ్‌ .. ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో కార్యకర్తల్లో కొత్త ఊపు వచ్చింది. బహుశా రాహుల్ గాంధీపై గతంలో ఉన్న నమ్మకాలు ఒక్కొక్కటిగా పటాపంచలు అవుతున్నట్టు ఉన్నాయి. సొంత పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుండడంతో.. ఈ ఊపు మరింత ఎక్కువైంది. రాహుల్ యాత్ర ప్రారంభించనప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆదరణ పెరిగింది. ప్రచారం కూడా పెరిగింది. దీంతో రాహుల్ షేర్ చేసిన ఈ ఫొటోపై కాంగ్రెస్ కార్యకర్తలు ఉబ్బితబ్బివుతున్నారు. తమ ఆనందాన్ని, గౌరవాన్ని ట్వీట్లు, కామెంట్ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

Assam: బిడ్డను ఎత్తుకెళ్లేందుకు తల్లి హత్య.. పిల్లలు పుట్టని తమ కూతురు కోసం దంపతుల ఘాతుకం

సెప్టెంర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. 100 రోజులు ముగించుకుని దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. మొత్తం 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర జమ్మూ కశ్మీర్‭లోని శ్రీనగర్ చేరుకోవడంతో ముగుస్తుంది. అయితే మొదటి దశ పాదయాత్ర అని, రెండవ దశ గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ యాత్రలో భాగంగా ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు పూర్తయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు