Assam: బిడ్డను ఎత్తుకెళ్లేందుకు తల్లి హత్య.. పిల్లలు పుట్టని తమ కూతురు కోసం దంపతుల ఘాతుకం

పిల్లలు లేకపోతే ఎవరైనా అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటారు. కానీ, ఒక జంట మాత్రం తల్లిని చంపి, ఆమె పది నెలల చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసులకు చిక్కింది. నిందితుల్ని అదుపులోకి తీసుకుని, చిన్నారిని కాపాడారు.

Assam: బిడ్డను ఎత్తుకెళ్లేందుకు తల్లి హత్య.. పిల్లలు పుట్టని తమ కూతురు కోసం దంపతుల ఘాతుకం

Assam: అసోంలో ఒక జంట ఘాతుకానికి పాల్పడింది. పెళ్లై, చాలా కాలంగా పిల్లలు పుట్టని తమ కూతురుకు బిడ్డను ఇచ్చేందుకు మరో తల్లి దగ్గరి నుంచి బిడ్డను ఎత్తుకెళ్లాలనుకున్నారు. దీనికి ఆ తల్లి నిరాకరించడంతో ఏకంగా ఆమెను చంపేశారు. ఈ ఘటన అసోం, చారైదియో జిల్లా, కెండుగురి బైలుంగ్ గ్రామంలో గత మంగళవారం జరిగింది.

Group 4 Jobs: నిలిచిపోయిన గ్రూప్-4 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ.. అభ్యర్థుల్లో అయోమయం

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రణాలి-బసంత దంపతులకు ఒక కూతురుంది. ఆమెకు చాలా కాలం క్రితమే పెళ్లైనప్పటికీ, పిల్లలు లేరు. తమ కూతురుకు పిల్లలు లేకపోవడంతో తీవ్రంగా కలత చెందిన ప్రణాలి-బసంత దంపతులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా బిడ్డను ఎత్తుకొచ్చి, తమ కూతురుకు ఇవ్వాలి అనుకున్నారు. ఇందుకోసం ఒక ప్రణాళిక రచించారు. దీనికి అసోంకు చెందిన నిటుమోని అనే మహిళను ఎంచుకున్నారు. ఆమెకు పది నెలల కూతురుంది. ఆమె దగ్గరి నుంచి ఎలాగైనా ఆ పాపను ఎత్తుకెళ్లాలనేది వాళ్ల ప్లాన్. ఇందుకోసం నిటుమోనిని పని కోసం పిలిచారు. తర్వాత ఆమె దగ్గరి నుంచి బిడ్డను లాక్కునే ప్రయత్నం చేశారు.

Chanda Kochhar: అక్రమ రుణ మంజూరు కేసులో ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్

అయితే, తన బిడ్డను ఇచ్చేందకు నిటుమోని నిరాకరించింది. దీంతో ఆమెను హత్య చేశారు. తర్వాత ఆమె మృతదేహాన్ని దగ్గర్లోని ఒక డ్రైనేజీలో పడేశారు. అనంతరం ఆమె పది నెలల బిడ్డను అక్కడ్నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే, నిటుమోని కనిపించకపోవడంతో సోమవారం మిస్సింగ్ కేసు నమోదైంది. మంగళవారం ఆమె మృతదేహం డ్రైనేజీలో దొరికింది. కానీ, ఆమె పాప కనిపించకపోవడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. హత్యకు పాల్పడ్డ ప్రణాలి-బసంత జంటను పోలీసులు పట్టుకున్నారు. అప్పటికే ఆ పాపతో వారి కొడుకు ప్రశాంత పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు.

రైల్వే స్టేషన్లో అతడ్ని అరెస్టు చేశారు. అతడి దగ్గరి నుంచి పాపను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రణాలి-బసంత, వారి కొడుకు ప్రశాంతతోపాటు మృతురాలి తల్లి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు నలుగురినీ అరెస్టు చేశారు. పిల్లలు లేని తమ కూతురుకు బిడ్డను ఇచ్చేందుకే ఈ నేరానికి పాల్పడ్డట్లు ప్రణాలి-బసంత దంపతులు తెలిపారు.