Chanda Kochhar: అక్రమ రుణ మంజూరు కేసులో ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్

ఐసీఐసీసీ బ్యాంకు సీఈవోగా ఉన్న సమయంలో చందా కొచ్చర్ వీడియోకాన్ గ్రూప్ కంపెనీకి రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేసింది. అయితే, వీడియోకాన్ గ్రూప్ కంపెనీకి సరైన అర్హతలు లేకుండానే, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణం మంజూరు చేసినట్లు ఆమెపై ఆరోపణలొచ్చాయి.

Chanda Kochhar: అక్రమ రుణ మంజూరు కేసులో ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్

Chanda Kochhar: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో, మాజీ ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీడియోకాన్ కంపెనీకి రుణం మంజూరు విషయంలో అవకతవకలకు పాల్పడ్డందుకుగాను వారిని అరెస్టు చేశారు. 2012లో ఐసీఐసీసీ బ్యాంకు సీఈవోగా ఉన్న సమయంలో చందా కొచ్చర్ వీడియోకాన్ గ్రూప్ కంపెనీకి రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేసింది.

Kamal Haasan: ‘భారత్ జోడో యాత్ర’లో చేరనున్న కమల్ హాసన్.. ఢిల్లీలో రాహుల్‌తో కలిసి పాదయాత్ర

అయితే, వీడియోకాన్ గ్రూప్ కంపెనీకి సరైన అర్హతలు లేకుండానే, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణం మంజూరు చేసినట్లు ఆమెపై ఆరోపణలొచ్చాయి. రుణం తీసుకున్న తర్వాత వీడియోకాన్ సరైన చెల్లింపులు జరపలేదు. దీంతో ఈ రుణం బ్యాంకుకు ఎన్పీఏ (నిరర్ధక ఆస్తి)గా మారింది. ఈ విషయంలో బ్యాంకు ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. మరోవైపు వీడియోకాన్ గ్రూప్‌నకు ఈ రుణం మంజూరు చేయడం ద్వారా చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, ఇతర కుటుంబ సభ్యులు భారీగా లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. వీడియోకాన్ సంస్థ ఛైర్మన్ వేణుగోపాల్ దూత్, దీపక్ కొచ్చర్ స్థాపించిన న్యూ పవర్ అనే ఒక ఎనర్జీ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఐసీఐసీఐ నుంచి రుణం పొందిన తర్వాత, దీపక్ కొచ్చర్ సంస్థలోకి ఈ నిధులు రావడం విశేషం.

Covid-19: కోవిడ్ తీవ్రతపై కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

అంటే ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ అధినేత అక్రమంగా రుణం తీసుకుని, చందా కొచ్చర్ సంస్థలో పెట్టుబడులు పెట్టాడని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో తాజాగా చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. రుణ మంజూరులో అవకతవకలకు పాల్పడ్డట్లు చందా కొచ్చర్‌పై అభియోగాలు రావడంతో ఆమె ఐసీఐసీఐ బ్యాంకు బాధ్యతల నుంచి 2018లో తప్పుకొన్నారు. కాగా, ఈ ఆరోపణలను చందా కొచ్చర్ తోసిపుచ్చారు. తాను నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించలేదని, అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా ఆమె కంపెనీని విజయపథంలో నడిపించారు. అప్పట్లో ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.