Kerala Govt : విద్యార్థినిల‌కు 60 రోజుల మెట‌ర్నిటీ లీవ్‌ .. ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యార్ధులకు 60 రోజులు మెటర్నిటీ లీవులు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సబంధించి వర్శిటీకి ఆదేశాలు జారీ చేసింది.

Kerala Govt : విద్యార్థినిల‌కు 60 రోజుల మెట‌ర్నిటీ లీవ్‌ .. ప్రభుత్వం కీలక నిర్ణయం

University In Kerala To Give 60 Days Maternity Leave To Pregnant Students

Kerala Govt : విద్యార్ధులకు 60 రోజులు మెటర్నిటీ లీవులు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అదేంటీ విద్యార్ధులకు మెటర్నిటీ లీవులా అని ఆశ్చర్యపోవచ్చు. కానీ యూనివర్శిటీల్లో వివాహితలు కూడా ఉంటారనే విషయం తెలిసిందే. పీజీలు, పీహెచ్ డీలు చేస్తుంటారు. అటువంటివారికి వీలు కల్పిస్తూ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణి విద్యార్ధులకు మెటర్నిటీ లీవులు 60రోజులు నిర్ణయం తీసుకుంది. దీనికి సబంధించి వర్శిటీకి ఆదేశాలు జారీ చేసింది.

కేర‌ళ‌లోని మహాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ.. ప్రెగ్నెంట్ విద్యార్థుల‌కు 60 రోజుల మెట‌ర్నిటీ లీవ్‌ను మంజూరీ చేయ‌నుంది. కానీ 18 ఏళ్లు దాటిన అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినుల‌కు మాత్రమే ఇటువంటి అవకాశం క‌ల్పించారు. విద్యార్థినులకు 60రోజులు ప్రసూతి సెలవులు ఇవ్వాలని సిఫార్సు చేస్తూ నలుగురు సభ్యులతో కూడిన కమిటీ సమసర్పించిన నివేదికను శుక్రవారం (డిసెంబర్ 23,2022) వైస్ ఛాన్సలర్ డీటీ అరవింత్ కుమార్ అధ్యక్షతన వర్శిటీలు సిండికేట్ సమావేశం ఆమోదించింది.

గర్భిణి విద్యార్థినిల చ‌దువుల‌కు ఎటువంటి అవాంత‌రం క‌ల‌గ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌దని..ప్రొఫెస‌ర్ వైస్ ఛాన్స‌ల‌ర్ సీటీ అర‌వింద కుమార్ వెల్లడించారు. దీనికి సంబందించి ఆదేశాల‌ను జారీ చేశారు. ఈ అంశంపై క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మ‌హిళా విద్యార్థినుల‌కు ప్రెగ్నెన్సీ లీవ్ ఇవ్వ‌నున్న‌ామని..ప్రసవానికి ముందు లేదా ప్రసవానికి తరువాత గానీ మెట‌ర్నిటీ లీవ్‌ల‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు. కానీ ఇక్కడో షరతు కూడా ఉంది. అదేమంటే విద్యార్థినులు తొలి ప్రెగ్నీన్సీ లేదా రెండవ ప్రెగ్నెన్సీ సమయంలో మాత్రమే ఈ సెలవులను వినియోగించుకోవాలి.అబార్ష‌న్ లేదా ట్యూబెక్ట‌మీ కేసుల్లో 14 రోజుల లీవ్ ఇవ్వ‌నున్న‌ట్లు వ‌ర్సిటీ వెల్లడించింది.