Ram Temple darshan: అయోధ్యలో రామమందిర దర్శనానికి రాహుల్‌నూ ఆహ్వానిస్తాం: ఫడ్నవీస్

‘‘రాహుల్ గాంధీ పాత సమస్యలపై ఇప్పుడు మాట్లాడుతున్నారు. పదేళ్ల క్రితం అడగాల్సిన ప్రశ్నలను ఇప్పుడు అడుగుతున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం సమర్థంగా కొనసాగుతోందన్న విషయం రాహుల్ కి తెలియదేమో. మందిర నిర్మాణం పూర్తయ్యాక ఆయనకు కూడా ఆహ్వానం అందుతుంది’’ అని ఫడ్నవీస్ చెప్పారు.

Ram Temple darshan: అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయ్యాక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా దర్శనానికి ఆహ్వానిస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మధ్యప్రదేశ్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫడ్నవీస్ ఈ సందర్భంగా ఇవాళ మీడియాతో మాట్లాడారు. ‘‘రాహుల్ గాంధీ పాత సమస్యలపై ఇప్పుడు మాట్లాడుతున్నారు. పదేళ్ల క్రితం అడగాల్సిన ప్రశ్నలను ఇప్పుడు అడుగుతున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం సమర్థంగా కొనసాగుతోందన్న విషయం రాహుల్ కి తెలియదేమో. మందిర నిర్మాణం పూర్తయ్యాక ఆయనకు కూడా ఆహ్వానం అందుతుంది’’ అని ఫడ్నవీస్ చెప్పారు.

కాగా, కొన్ని రోజులుగా రామ మందిర అంశాలన్ని బీజేపీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలోనే మళ్ళీ ఈ అంశాన్ని లేవనెత్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఏడాది జనవరి 1లోగా రామమందిరం సిద్ధమవుతుందని ఇటీవలే కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారు.

అయోధ్య రామమందిర నిర్మాణం జరగకుండా కాంగ్రెస్ కోర్టులకు వెళ్లిందని చెప్పారు. చివరకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించామని అన్నారు. రామమందిరం 2023 డిసెంబరులో లేదంటే 2024 సంక్రాంతికి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు పలు సార్లు రామజన్మభూమి మందిర్‌ తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధులు కూడా తెలిపారు.

Kamareddy Collector Explanation : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ వివరణ.. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే

ట్రెండింగ్ వార్తలు