కరోనా వైరస్ వ్యాప్తి బారినుంచి కాపాడకోటానికి ప్రజలంతా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ పరిసరాలు శానిటైజ్ చేసుకోవటం, శానిటైజర్ తో చేతులు శుభ్రంచేసుకోవటం, ముఖానికి మాస్క్ ధరించటం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక బైక్ పై ప్రయాణించేటప్పుడు కొత్త వారికి లిఫ్టు ఇవ్వకపోవటం వంటి ఇతర జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రజలు వ్యక్తిగతంగా వారి వారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు రైల్వే శాఖ నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. రైలు ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రయాణికులు కూడా ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉన్నారు.
రైలు స్టేషన్ లో కొన్నికరోనా పరీక్షలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికులు మాస్క్ లు ధరించటం, శానిటైజర్ ఉపయోగించటం చేస్తున్నారు. ప్రయాణించేటప్పుడు కూడా ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించిన దంపతులు మరిన్నిజాగ్రత్తలు తీసుకున్నారు.
తమకు కేటాయించిన బెర్త్ చుట్టూ దుప్పట్లతో తెరలు కట్టుకున్నారు. ప్రయాణ సమయంలో ఎవరైనా తుమ్మినా, దగ్గినా ఇబ్బంది లేకుండా…. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ఇలా చేశామని చెప్పారు. ఇది చూసి మిగతా ప్రయాణికులు కొంత ఆశ్చర్యపోయినా, మరి కొందరు మాత్రం ఎవరి జాగ్రత్త వారిది అంటూ వ్యాఖ్యానించారు.