Beheads Wife: కొవిడ్ పాజిటివ్ వచ్చిన భార్య తల వేరు చేసిన భర్త
బీహార్ లోని పాట్నాలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి తన భార్యకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిసి తలను శరీరం నుంచి ...

DEAD
Beheads Wife: బీహార్ లోని పాట్నాలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి తన భార్యకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిసి తలను శరీరం నుంచి వేరు చేశాడు. పత్రాకర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నాచక్ లొకాలిటీలో ఉన్న ఓ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న దంపతుల మధ్య జరిగిన ఘటనతో స్థానికులు షాక్ అయ్యారు.
అతుల్ లాల్ అనే వ్యక్తి.. పాజిటివ్ అని తెలియగానే భార్యను హతమార్చాడు. ఆ తర్వాత అపార్ట్మెంట్ టెర్రస్ పై నుంచి దూకేశాడు. భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
మరో ఘటనలో భార్యను 25సార్లు కత్తితో పొడిచి..
ఏప్రిల్ నెలలోనే భార్యకు వివాహేతర సంబంధం ఉందని కత్తితో 25సార్లు పొడిచి చంపేశాడు. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని బుద్ విహార్ ప్రాంతంలో అందరూ చూస్తుండగానే బహిరంగంగా హత్య చేశాడు పట్టపగలు కత్తితో 25సార్లు పొడిచి చంపుతుంటే స్థానికులు భయపడిపోయి చూస్తుండిపోయారు.
నిందితుడు మ్యారేజి బ్యూరోలో పనిచేస్తున్నట్లుగా విచారణలో తేలింది. ఘటన జరిగిన కాసేపటికే నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.