Train
Railway protection system Kavach : రైలు ప్రమాదాల నివారణలో కీలక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. రైలు రక్షణ వ్యవస్థ కవచ్ విజయవంతమైంది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొట్టకుండా కవచ్ ఆపేసింది. సికింద్రాబాద్ డివిజన్ లింగంపల్లి-వికారాబాద్ సెక్షన్ మధ్య ట్రయల్ రన్ సక్సెస్ అయింది. కవచ్ పనితీరును రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లను ఆటోమేటిక్‌గా 380 మీటర్ల దూరంలో కవచ్ నిలిపివేసింది.
ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు వేగంగా వస్తున్నాయి. ఒక ట్రైన్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉన్నారు. ఆయనతో పాటు అధికారులు అందులో ప్రయాణిస్తున్నారు. ఎదురుగా వస్తున్న మరో ట్రైన్‌లో రైల్వే బోర్డు ఛైర్మన్ మరికొంత మంది అధికారులు ఉన్నారు. అదెక్కడో కాదు సికింద్రాబాద్ డివిజన్ లింగంపల్లి -వికారాబాద్ దగ్గర ట్రాక్‌పై వస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో ఏం జరుగుతుందోనని టెన్షన్ మొదలైంది. కానీ రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై కొద్ది దూరంలో నిలిచిపోయాయి.
Indian Railway : రైల్వే ప్రయాణికుల భద్రతకోసం….అగ్నినిరోధక రైల్వే కోచ్ లు
ఢీకొట్టకుండా ఆగిపోయాయి. ఇదంతా కవచ్ వ్యవస్థ వల్ల సాధ్యమైంది. రైలు రక్షణ వ్యవస్థ కవచ్ రెండు రైళ్లు ఢీకొట్టకుండా ఆపగలిగింది. దక్షిణ మధ్య రైల్వే వేదికగా రైల్వే వ్యవస్థలో కీలక పరిణామమని చెప్పవచ్చు. ప్రమాద నివారణలో ఈ కవచ్ పనిచేయనుంది. ప్రపంచంలోనే అత్యంత చవకైన రైళు ప్రమాద నివారణ వ్యవస్థగా రికార్డ్ సృష్టించింది. ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ కవచ్‌ను రైల్వే శాఖ తయారు చేసింది.
దేశంలో రైలు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలను నివారించలేకపోతున్నారు. రైలు స్పీడుగా ఉన్న సమయంలో నియంత్రించడం కష్టమైన పని. ఒక వేళ స్పీడ్ బ్రేకులు వేసినప్పటికీ కొన్ని సార్లు ఆపలేకపోతారు. కానీ కవచ్ వ్యవస్థతో దీన్ని నివారించవచ్చు. అంతే కాదు ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు వస్తే…కొన్ని మీటర్ల దూరంలోనే గుర్తించి కవచ్ ఆటోమెటిక్‌గా నిలిపివేస్తుంది.
Delhi Station : వణుకు పుట్టించే వీడియో, కదులుతున్న రైలు ఎక్కబోయాడు..కాపాడిన పోలీసు
కవచ్ ద్వారా దేశంలో పూర్తిగా రైల్వే ప్రమాదాలను నివారించవచ్చంటున్నారు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో సిగ్నల్ జంప్ చేయడం, లేదా సాంకేతిక సమస్యలు తలెత్తిన కవచ్ గుర్తిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. రేడియో ఫ్రిక్వెన్సీ ద్వారా కవచ్ పనిచేస్తుంది. దీనికి సిల్-4 గుర్తింపు లభించింది.
రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఒక ట్రైన్‌లో కవచ్ యాక్టివేట్ అయితే 5 కిలోమీటర్ల పరిధిలో మిగతా రైళ్లను కూడా అలర్ట్ చేస్తుంది.అలా ట్రాకులు మార్చుకోవడానికి వీలు కూడా ఉంటుంది. మొదట దక్షిణ మధ్య రైల్వేలో వెయ్యి 98 కిలోమీటర్ల పరిధిలో 65 లోకో ఇంజిన్లకు అమర్చనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ-ముంబై, ఢిల్లీ -హౌరా కారిడార్లలో 3 వేల కీలోమీటర్ల పరిధిలో అమర్చనున్నారు.