రైల్వే జరిమానాల ఆదాయమే రూ.1377కోట్లు
తప్పించుకుంటున్న వారిని పక్కనపెడితే టిక్కెట్ లేకుండా ప్రయాణం ద్వారా వచ్చిన జరిమానాల మొత్తం రూ.1377కోట్లు.

తప్పించుకుంటున్న వారిని పక్కనపెడితే టిక్కెట్ లేకుండా ప్రయాణం ద్వారా వచ్చిన జరిమానాల మొత్తం రూ.1377కోట్లు.
‘టిక్కెట్ లేని ప్రయాణం చట్టరీత్యా నేరం. అందుకు జరిమానా తప్పనిసరి’ నినాదాలు చూస్తూనే ఉన్నా… టిక్కెట్ లేని ప్రయాణాలు జరుగుతూనే ఉన్నాయి. తప్పించుకుంటున్న వారిని పక్కనపెడితే టిక్కెట్ లేకుండా ప్రయాణం ద్వారా వచ్చిన జరిమానాల మొత్తం రూ.1377కోట్లు. వీరి జాబితా చూస్తే మూడేళ్లుగా 31శాతం మంది పెరగడం శోచనీయం.
టిక్కెట్టు లేని ప్రయాణాల కారణంగా రైల్వే ఘోరంగా నష్టపోతుందని పార్లమెంట్ రైల్వే కన్వెన్షన్ కమిటీ 2018లో వెల్లడించింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న రైల్వే టిక్కెట్ లేని ప్రయాణాలపై కన్నేసింది. ఫలితంగా భారీ వసూళ్లు చేపట్టి 2016-17నాటికి రూ. 405.30కోట్లు, ఆ తర్వాత రూ.441.62కోట్లు, 2018-19నాటికి 530.06కోట్లు వసూలు చేసింది. మధ్య ప్రదేశ్‌లోని ఓ వ్యక్తి ఆర్టీఐ ఫైల్ చేయడం ద్వారా ఈ విషయం వెల్లడైంది.
టిక్కెట్ లేని ప్రయాణికులు మొత్తంగా 8.9మిలియన్ మంది ఉన్నారట. టిక్కెట్ లేని ప్రయాణంలో దొరికితే ముందుగా అతనికి రూ.250కనీస జరిమానా ఉంటుంది. అది కట్టలేకపోతే రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)కు అప్పగిస్తారు. అక్కడ రైల్వే చట్టం సెక్షన్ 137కింద అరెస్టు చేస్తారు. కోర్టులో హాజరుపరిచి వెయ్యి రూపాయల వరకూ జరిమానా విధిస్తారు. అప్పటికీ జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే ఆర్నెల్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే.