Smoking In Trains : పొగ తాగితే..భారీ జరిమాన, అరెస్టు కూడా చేస్తారంట

భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండాలంటే..కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావించింది.

Smoking

Railways : ఏ ప్లేస్ లో ఉన్నా..సరే..కొంతమంది పొగ తాగుతుంటారు. పక్కవారికి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా..అదే విధంగా ప్రవర్తిస్తుంటారు. ప్రధానంగా..రద్దీ ఉన్న ప్రదేశాలు, బస్, రైల్వే స్టేషన్ లలో సిగరేట్ తాగ వద్దని హెచ్చరిక బోర్డులు ఉన్నా..డోంట్ కేర్ అంటుంటారు. రైళ్లలో కూడా కొంతమంది సిగరేట్, బీడీ తాగుతుంటారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా..అదే విధంగా ప్రవర్తిస్తుండడంపై భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే న్యూఢిల్లీ – డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ట్రైన్ కంపార్ట్ మెంట్ లో ధూమపానం చేసిన ఓ ప్రయాణికుడు సిగరేట్ తాగి పీకలను టాయిలెట్ లో వేశాడు. అక్కడున్న టిష్యూ పేపర్ కు అంటుకుని అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

దీంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండాలంటే..కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావించింది. ధూమపానం చేసిన వారికి భారీ మొత్తంలో జరిమానా విధించడంతో పాటు..అరెస్టు కూడా చేస్తామని పేర్కొంది. ధూమపానం చేసే ప్రయాణికులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జోనల్‌ జనరల్ మేనేజర్లు, రైల్వే బోర్డు సభ్యులను కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆదేశించారు కూడా. ప్రస్తుతం రైల్వే చట్టంలోని సెక్షన్ 167 ప్రకారం రైల్వే కంపార్టుమెంట్‌లో ధూమపానం చేసిన ప్రయాణికులకు రైల్వే అధికారులు రూ.100 ఫైన్‌ విధిస్తున్న విషయం తెలిసిందే.