రాజస్థాన్‌లో రక్తమోడిన రోడ్డు : 11 మంది మృతి

  • Publish Date - November 23, 2019 / 04:05 AM IST

రాజస్థాన్‌లో రోడ్డు రక్తమోడింది. మినీ బస్సులు ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన కుచమాన్ వద్ద చోటు చేసుకుంది. మృతదేహాలు, రక్తంతో ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మరికొంతమందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

రాజస్థాన్‌లోని కుచమన్ నగరమైన నాగౌర్‌లో 2019, నవంబర్ 23వ తేదీ శనివారం తెల్లవారుజామున వేగంగా ప్రయాణీస్తున్న రెండు మినీ బస్సులు ఢీకొన్నాయి. వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. 11మంది అక్కడికక్కడనే చనిపోయారు. వ్యాన్‌లో ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 
Read More : మహా ట్విస్ట్ : మరాఠ రాజకీయాల్లో ఊహించని మలుపు